twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫలక్‌నుమా దాస్, పోలీసుగా పెళ్లిచూపులు డైరెక్టర్.. టీజర్ మొత్తం బూతే!

    |

    బోల్డ్ చిత్రాల పేరుతో ప్రస్తుతం బూతు డైలాగులు, అసభ్యకర సన్నివేశాలని చిత్రీకరించే చిత్రాలు ఎక్కువవుతున్నాయి. ఆ కోవలోకి చెందినదే ఫలక్‌నుమా దాస్ చిత్రం. ఈ నగరానికి ఏమైంది ఫేమ్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ, దర్శత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ గల్లీ గ్యాంగ్ మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సలోని మిశ్ర, హర్షిత గౌర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఉన్న బూతు కంటెంట్ హాట్ టాపిక్ గా మారింది.

    బోల్డ్ చిత్రాల హవా

    బోల్డ్ చిత్రాల హవా

    ప్రస్తుతం టాలీవుడ్ లో బోల్డ్ చిత్రాల హవా పెరుగుతోంది. డైలాగులతో ద్వంద అర్థాలు, పరుష పదజాలం, అసభ్యకరమైన రొమాన్స్ సన్నివేశాలతో చెలరేగిపోతున్నారు. యూట్యూబ్ లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఫలక్‌నుమా దాస్ టీజర్ విడుదలై వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ లో వినలేని పరుష పదజాలంతో డైలాగులు ఉన్నాయి.

    పోలీస్‌గా తరుణ్ భాస్కర్

    పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారికగా కనిపిస్తున్నాడు. కుర్రాళ్ల మధ్య జరిగే గ్యాంగ్ వార్ లని డీల్ చేసే పోలీస్ గా తరుణ్ నటిస్తున్నాడు. వ్యసనాలకు అలవాటు పడి యువత ఎలాంటి క్రైం లకు పాల్పడతారో ఈ ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు చూపించారు.

    రొమాంటిక్ సన్నివేశాలు

    రొమాంటిక్ సన్నివేశాలు

    ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్న సలోని మిశ్ర, హర్షిత గౌర్ లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలలో ఘాటుగానే నటించినట్లు తెలుస్తోంది. ట్రయిలర్ లో బూతు డైలాగులు, అల్లరి మూకల గొడవలని హైలైట్ చేసారు తప్ప ఆసక్తికరంగా ఏమీ లేదు. ట్రైలర్ లో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇలాంటి చిత్రాల ట్రెండే నడుస్తోంది కాబట్టి ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

    త్వరలో విడుదల

    త్వరలో విడుదల

    విశ్వక్సేన్ నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కరాటే రాజు నిర్మాత. విద్యాసాగర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. వాన్మయే క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశ్వక్సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది చిత్రం నిరాశపరిచింది. దీనితో ఈ సారి బోల్డ్ కంటెంట్ తో ప్రయత్నిస్తున్నాడు. ఏ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

    English summary
    Vishwak Sen, Tharun Bhascker's Falaknuma Das Official Teaser released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X