Gangs Of Godavari: విశ్వక్ సేన్ సంచలన ట్వీట్.. బడా నిర్మాతలతో బయటపడ్డ విబేధాలు.. టాలీవుడ్‌లో కలకలం

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా మందే యంగ్ టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకడు. కెరీర్ ఆరంభంలోనే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ ఏడాదిలోనే 'దాస్ కా ధమ్కీ' అనే మాస్ యాక్షన్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమాపై విశ్వక్ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. ఆ వివరాలను మీరే చూడండి!

విశ్వక్ సేన్ ప్రస్తుతం తన 11వ సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్నాడు. గోదావరి జిల్లాల నేపథ్యంతో సాగే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

Vishwak Sen Tweet on Gangs Of Godavari Release Creates Controversy

క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను డిసెంబర్ 8వ తేదీనే విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన పనులను అన్నీ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీని వాయిదా వేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదలపై తాజాగా విశ్వక్ సేన్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. 'బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకూ మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8వ తేదీనే వస్తున్నాం. హిట్ చేస్తారా? లేక ఫ్లాప్ చేస్తారా? మీ నిర్ణయం' అన్నాడు.

Vishwak Sen Tweet on Gangs Of Godavari Release Creates Controversy

అదే ట్వీట్‌లో విశ్వక్ సేన్ 'ఆవేశానికి లేదా ఇగోకు తీసుకునే నిర్ణయం కాదు. తగ్గే కొద్దీ మింగుతారు అనేది అర్థం అయింది. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహా కాళి మాతో ఉంది. ఒకవేళ డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కాకపోతే నన్ను ప్రమోషన్స్‌లో కూడా చూడలేరు' అంటూ చెప్పాడు. తద్వారా నిర్మాతలతో విబేధాలు ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించాడు.

ఇక, విశ్వక్ సేన్ చేసిన తాజా ట్వీట్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ విషయంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయం గురించే అని అర్థం అవుతోంది. వాళ్లు ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని అనుకుంటున్నారని, దానికి విశ్వక్ వ్యతిరేకంగా ఉన్నాడని ఈ ట్వీట్ చూసిన వాళ్లు అనుకుంటున్నారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది.

ఇదిలా ఉండగా.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రను చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X