Vishwak Sen: మరోసారి వివాదంలో విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తనదైన స్టైల్ లో విభిన్నమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే ఓరి దేవుడా చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదల తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ మాస్ హీరో మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. ఇంతకుముందు అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లలో భాగంగా చేసిన ప్రాంక్ వీడియో రచ్చ రచ్చ అయిన విశ్వక సేన్ పై తను చేస్తున్న సినిమా టీమ్ సీరియస్ గా ఉందని సమాచారం.

విశ్వక్ సేన్ కోపం గురించి..

విశ్వక్ సేన్ కోపం గురించి..

వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ ఫలక్ నూమా దాస్ సినిమాతో మాస్ కా దాస్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల ఓరి దేవుడా సినిమాతో అలరించిన ఈ హీరో కోపం గురించి తెలిసిందే. ఎన్నో సార్లు అతను పొగరు చూపించాడని ఇండస్ట్రీలోని అనేక మంది నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ముక్కు సూటిగా మాట్లాడుతూ తరచూ వివాదంలో ఇరుక్కుంటున్నాడు విశ్వక్ సేన్.

ఫ్రాంక్ వీడియో రచ్చ..

ఫ్రాంక్ వీడియో రచ్చ..

ఫలక్ నూమా దాస్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కాంట్రవర్సీ అయిన ఈ హీరో ఇటీవల విడుదైలన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన పనికి వివాదంలో పడ్డాడు. అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్స్ స్టంట్ కింది ఓ ప్రాంక్ వీడియో చేసి అబాసుపాలయ్యాడు విశ్వక్ సేన్. అతి ఎంత పెద్ద రచ్చ అయిందో తెలిసిందే. ప్రాంక్ వీడియోతో నెటిజన్లకు కోపం తెప్పించిన విశ్వక్ సేన్.. యాంకర్ తో మాట్లాడిన తీరుతో కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది.

అర్జున్ సర్జా దర్శకత్వంలో..

అర్జున్ సర్జా దర్శకత్వంలో..

అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ఆ తర్వాత హిట్ కావడం, తదితర విషయాలతో గొడవ సద్దుమణిగింది. అయితే ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు ఈ మాస్ హీరో. విశ్వక్ సేన్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్వక్ సేన్.. డైరెక్టర్ అండ్ యాక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.

 రెండు షెడ్యూల్స్ కు కాల్షీట్లు..

రెండు షెడ్యూల్స్ కు కాల్షీట్లు..

అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరై.. ముహుర్తం క్లాప్ కొట్టి మరి ప్రారంభించారు. దీంతో ఈ సినిమా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కు కాల్షీట్లు ఇచ్చిన విశ్వక్ సేన్ ఇప్పటివరకు ఒక్క రోజు కూడా షూటింగ్ కు రాలేదట. ఏమైందో తెలియదు గానీ సడెన్ గా షూటింగ్ కు రానని విశ్వక్ సేన్ చెప్పేశాడని సమాచారం.

షెడ్యూల్ ఎలా మారుస్తారు..

షెడ్యూల్ ఎలా మారుస్తారు..

ఎంతమంది కాల్స్ చేసిన లిఫ్ట్ చేయట్లేదట. దీంతో విశ్వక్ సేన్ పై అర్జున్ సర్జా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై మాట్లాడారు. ''షూటింగ్ కు రమ్మని విశ్వక్ కు ఎన్నోసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. షెడ్యూల్ మార్చమని చెబుతున్నాడు. మొత్తం షెడ్యూల్ ఎలా మారుస్తారు. విశ్వక్ సేన్ బిహేవియర్ మా టీమ్ కు ఎంతో ఇబ్బందికి గురి చేసింది. ఈ విషయం గురించి అతనితో ఎన్నిసార్లు మాట్లాడాలని పిలిచినా విశ్వక్ సేన్ స్పందించలేదు'' అని అర్జున్ సర్జా చెప్పుకొచ్చాడు.

విశ్వక్ సేన్ పై ఫిర్యాదు..

విశ్వక్ సేన్ పై ఫిర్యాదు..

ఈ విషయంపై విశ్వక్ సేన్ ప్రవర్తనపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేద్దామని భావిస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఈ విషయం ఎంతదూరం వెళ్తుందనేది వేచి చూడాలి. కాగా అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబుతో కలిసి నటించారు. ఆ తర్వాత నిర్మాతగా, డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో అర్జున్ సర్జా డైరెక్ట్ చేస్తోంది దర్శకుడిగా 12వ సినిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X