కమల్ ‘విశ్వరూపం-2’ ఫస్ట్‌లుక్(ఫోటో)
చెన్నై : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు విశ్వరూపం-2ని తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు కమల్. ఆగస్టులో ఈ చిత్రం తెరపైకి వస్తుంది.

విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో ఇటీవల మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.


Click it and Unblock the Notifications











