twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం 2 ' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్ ఎన్నో వివాదాలు మోసుకుని వచ్చి విజయవంతమైన చిత్రం'విశ్వరూపం'. కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రానికి ఆయనే దర్శకుడు, నిర్మాత. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ విడుదల సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు కమల్‌ మొదట్లోనేనే ప్రకటించారు. మొదటి భాగమే పలు వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో కొనసాగింపు ఏ రీతిన ఉంటుంది? ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. 'విశ్వరూపం 2' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు నలభై శాతం వరకూ పూర్తైనట్లు తెలుస్తోంది. ఆండ్రియా పాత్రకు ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉందని వినికిడి.

    ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని కమల్‌హాసన్‌ భావిస్తున్నారు. ఈ కొనసాగింపు చిత్రానికి సంబంధించి కమల్‌ దర్శకత్వ బాధ్యతలకే పరిమితమయ్యారు. దీన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

    ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

    కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

    English summary
    Kamal Haasan’s ‘Vishwaroopam 2′ is currently under production. Kamal Haasan is aiming for an August 15th release and all efforts are being made to get the film ready on time. He has been secretive about the shooting. The sequel is being produced and marketed by Aascar Films V Ravichandran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X