విశ్వరూపం 2 ప్రీ రిలీజ్ రివ్యూ: కమల్ గట్స్‌కి హ్యాట్సాఫ్!
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ విశ్వరూపం2. రేపే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యనే విడుదలైన గూఢచారి చిత్రాన్ని ఆడియన్స్ ఎగబడుతున్నారు. మంచి యాక్షన్ మూవీ వస్తే బాగుణ్ణు అనుకొంటూ ఫ్యామిలీ, లవ్, మాస్ చిత్రాలతో విసిగిపోయిన ఆడియన్స్ కు గూఢచారి చిత్రం ఎడారిలో ఒయాసిస్ లాగా కనిపించింది. ఆడియన్స్ ఊహించిన విధంగానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవకు చెందిన చిత్రమే విశ్వరూపం 2 కూడా. కమల్ నటన కోసమే థియేటర్ కు వెళ్లే ఆడియన్స్ ఉన్నారు. ఇక భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తొలి భాగాన్ని మించేలా
విశ్వరూపం 2 ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కథ రాసే సమయంలో రెండు భాగాలుగా విభజించుకున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో దానికి మించేలా రెండవ భాగాన్ని రూపొందించారు.
Recommended Video


పూజా కుమార్
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ కుమార్, కీలక పాత్రలో నటిస్తున్న ఆండ్రియా కూడా ఆకర్షణే. పూజ కుమార్ తో కమల్ మార్క్ రొమాన్స్ కూడా హైలైట్ కానుంది. ట్రైలర్స్ లో హీటెక్కించే సన్నివేశాలు చూపించారు.

టెక్నికల్ గా
టెక్నికల్ గా కూడా విశ్వరూపం 2 చిత్రంలో ఆకర్షించే అంశాలు ఉన్నాయి. తొలి భాగంలో సినిమాటోగ్రాఫర్ సను వర్గేశ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కూడా విజువల్స్ అంతకు మించి ఉండేలా కనిపిస్తున్నాయి. టెర్రరిస్టుల స్థావరాలని వర్గేశ్ తొలి భాగంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

కమల్ హాసన్ స్టంట్స్
యాక్షన్ చిత్రంలో స్టంట్స్ తప్పనిసరిగా ఉంటాయి. కమల్ హాసన్ ఈ వయసులో కూడా అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేయగలరు. స్పై థ్రిల్లర్ సినిమాకు అనుగుణంగా గిబ్రాన్ సంగీతం కూడా అలరించబోతోంది.

హ్యాట్సాఫ్
కమల్ హాసన్ అద్భుతమైన నటుడు. ఆయనకు ఉన్న క్రేజ్ తో మంచి మాస్ మసాలా చిత్రాలు చేసుకోవచ్చు. కానీ ఈ వయసులో కూడా నటుడిగా ఏదో సాధించాలి, కొత్తదనం చూపించాలి అనే తపన ఇంకా ఉంది. తాను నటించే ప్రతి చిత్రంలో కొత్తదనం ఉండాలని కమల్ భవిస్తారు. విశ్వరూపం 2 చిత్రంలో నటిస్తూనే దర్శకత్వ భాద్యతలు కూడా చేపట్టారు. నిర్మాణంలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నిజంగా కమల్ గట్స్ కి హ్యాట్సాఫ్.


Click it and Unblock the Notifications











