'విశ్వరూపం 2' సెకండ్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. అంచనాలు పెంచేలా!
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం ఆగష్టు 10 న విడుదల కాబోతోంది. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం కోసం యాక్షన్ చిత్రాల ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా విడుదలైన ట్రైలర్ ఆసక్తికరమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉత్కంఠ పెంచేసింది. తాజగా ఈ చిత్ర సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. సెకండ్ ట్రైలర్ అంచనాలని రెట్టింపు చేసే విధంగా ఉంది.
మైండ్ బ్లోయింగ్ అనిపించే యాక్షన్ సీన్స్, కమల్ హాసన్ స్టంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. తొలి భాగంలో కమల్ హాసన్ గూఢచారిగా ఉగ్రవాదుల మధ్యలోనే ఉంటూ వారి విషయాలని తెలుసుకునే విధంగా ఉంటుంది. రెండవ భాగం ఎలా ఉంటుందనేది ఆగష్టు 10న తెలుసుకోవాలి.

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పూజ కుమార్, ఆండ్రియా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తరువాత కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











