కమల్ 'విశ్వరూపం' ఆడియో విడుదల తేదీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ : కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం 'విశ్వరూపం'. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'విశ్వరూపం' ఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగా ప్లాన్ చేశారు కమల్.

ఒకేరోజు మూడు నగరాల్లో ఈ ఆడియో వేడుక జరగనుంది. చెన్నయ్, కోయంబత్తూర్, మధురైలలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ మూడు చోట్ల జరిగే కార్యక్రమాల్లో కమల్‌హాసన్‌ పాల్గొని సీడీలను విడుదల చేస్తారు. ఒకే రోజు మూడు నగరాల్లో కాబట్టి, ఓ చార్టర్డ్ ప్లేన్‌ని అద్దెకు తీసుకున్నారని సమాచారం. ముందుగా మధురై, ఆ తర్వాత కోయంబత్తూర్, చివరిగా చెన్నయ్‌లో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.

రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని సమాచారం. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.

చిత్రం కథ ప్రకారం ఒక మధ్యతరగతి యువతి తన ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేయాలని భావిస్తుంది. అనుకున్నట్టుగానే నిరంతర కృషితో అమెరికాలో చదువుతుంది. నిరు అనే నిరుపమకు ఎస్ అనే విశ్వనాథన్‌కు మధ్య మూడేళ్ల ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. ప్రేమ, పెళ్లితో జీవితాన్ని ఎంజాయ్ చేసిన నిరుపమ పనిలో పనిగా పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టర్ నిరుపమా విశ్వనాథన్ హోదాను పొందుతుంది.

విశ్వనాథన్ తన కథక్ నాట్యశాల విద్యార్థులకు నృత్యం నే ర్పుతూ భార్యతో జీవితంలో స్థిరపడుతాడు. డాక్టర్ నిరుపమ విశ్వనాథన్ తన స్థాయికి తగ్గ భర్త కాదని ఆయన్ని దూరం చేసుకునే ప్రయత్నంలో పడుతుంది. ఆయనలోని లోపాలను వెదకడానికి ఒక డిటెక్టివ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత ఏమయ్యేందనేది విశ్వరూపం చిత్రం అంటున్నారు. వైరముత్తు సాహిత్యాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్ మహదేవన్, ఎషాన్‌నూరణి, లాయ్ మెంటోసా (శంకర్ ఎషాన్ లాయ్) సంగీతం అందించారు. ఇందులో కమలహాసన్ ఉగ్రవాది పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X