విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

చెన్నై: కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంపై 15 రోజుల బ్యాన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ముస్లిం మనో భావాలు దెబ్బతీసే విధంగా ఉందనే ఆందోళనల నేపథ్యంలో గవర్నమెంట్ ఈ చిత్రాన్ని నిపుణుల కమిటీతో పరిశీలించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే తమిళనాడు ప్రభుత్వం తీరుపై ఇటు సినీ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు ప్రభుత్వ చర్యను ఖండింస్తున్నారు. కమల్ హాసన్ కు అంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మేరకు పేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషనల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రభుత్వ తీరుపై కమల్ హాసన్ స్పందిస్తూ... తన చిత్రంపై నిషేదం విధించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇలా చేయడాన్ని సాంస్కృతిక ఉగ్రవాదంగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడటం సమంజసం కాదని, తమిళనాడు ప్రభుత్వంపై తాను న్యాయ పోరాటానికి దిగనున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కమల్ హాసన్ కు మద్దతుగా నిలిచిన సెలబ్రిటీలు, వారి కామెంట్స్ ఏమిటో స్లైడ్ షోలో చూద్దాం...

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

కుష్బూ: విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించారనే విషయం విని షాకయ్యాను. సెన్సార్ బోర్డు ఓకే చెప్పిన తర్వాత ప్రభుత్వం కలుగ జేసుకోవడం ఏమిటి. ఇది సరైంది కాదు. సరిగా ఉంటనే సెన్సార్ బోర్డు వారు సర్టిఫై చేస్తారు.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

ప్రకాష్ రాజ్: తెలుగు, తమిళం, హిందీ సెన్సార్ బోర్డులు విశ్వరూపం చిత్రానికి క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చాయి. అలాంటప్పుడు బ్యాన్ విధించాల్సిన అవసరం లేదు. ముస్లిం కంట్రీ అయిన మలేషియా కూడా ఈ చిత్రానికి క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించడం సరైంది కాదు.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

వెంకట్ ప్రభు: కమల్ సార్ విశ్వరూపం చిత్రంపై బ్యాన్ విధించారనే వార్త విని ఒక్కసారి షాకయ్యాను. కమల్ సార్ ఎప్పుడూ ఏదో సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

సిద్ధార్థ: విశ్వరూపం సినిమాపై బ్యాన్ విధించడం సరైంది కాదు. ఇలాంటి చర్యలు తమిళ సినీ పరిశ్రమకు తిరోగమనం లాంటిది.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

రమేష్ అరవింద్: నిషేదం విధించినా కమల్‌జీ గెలుస్తారు. సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డ్ క్లీయర్ సర్టిఫికెట్ ఇచ్చారు.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

విక్రమ్ ప్రభు: విశ్వరూపం చిత్రంపై 15 రోజుల నిషేదమా? 15 రోజుల్లో ఏం మారుతుంది? ప్రభుత్వ నిర్ణయం చాలా నిరుత్సాహ పరిచింది.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

ధనుంజయన్ గోవింద: విశ్వరూపం చిత్రంపై 15 రోజుల నిషేదం విధించారనే వార్త విని షాకయ్యాను. నిజంగా నమ్మలేక పోతున్నాను.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

మంచు లక్ష్మి: సినిమాలపై చెత్త రాజకీయాలు ప్రదర్శించ వద్దు. విశ్వరూపం చిత్రంపై నిషేదం విధించడం సరైంది కాదు.

విశ్వరూపం బ్యాన్: కమల్‌కు సెలబ్రిటీల మద్దతు(ఫోటో ఫీచర్)

దయానిధి అలగిరి: విశ్వరూపం చిత్రం విడుదలై పెద్ద హిట్టవుతుంది. నిషేదం విధించడంపై కమల్ హాసన్ కోర్టుకు ఎక్కురు. ఆయనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X