twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ రికార్డ్ బద్దలు కొట్టిన కమల్ హాసన్

    By Bojja Kumar
    |

    చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో సమ ఉజ్జీలైన హీరోలు ఎవరంటే అందురూ చెప్పే మాట రజనీకాంత్, కమల్ హాసన్. ఇద్దరూ హీరోగా ఒకే సారి గురువు బాలచందర్ శిశ్యరికంలో కెరీర్ ప్రారంభించారు. పోటా పోటీగా ఎదుగుతూ వచ్చారు. నటన విషయంలో, పాపులారిటీ విషయంలో ఎవరి ప్రత్యేకత వారిది.

    తాజాగా ఓ విషయంలో కమల్ హాసన్ పైచేయి సాధించారు. రజనీ 'రోబో' రికార్డును బద్దలు కొట్టారు. ఆ మధ్య రజనీ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' చిత్రం హిందీలో విడుదలై ఫస్ట్ వీకెండ్ నాటికి రూ. 7.5 కోట్లు వసూలు చేసింది. తొలి వారాంతం ముగిసేలోపు డబ్బింగ్ సినిమాలకు ఆ రేంజిలో వసూలు కావడం రికార్డు.

    తాజాగా కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రం 'రోబో' రికార్డును బద్దలు కొట్టింది. హిందీలో విడుదలైన 'విశ్వరూపం' చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో రూ. 7.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 'రోబో' రికార్డ్ బద్దలయినట్లయింది. కాగా... తమిళనాడులో ఆందోళనల వల్ల విడుదల నిలిచిపోయిన విశ్వరూపం అన్ని సమస్యలు పరిష్కరించుకుని ఈ నెల 7న విడుదలకు సిద్ధమవుతోంది.

    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. బ్యాన్ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్ట పోయింది.

    English summary
    Vishwaroopam beats Robo Record: Rajinikanth's 'Robot' was released in Hindi and was able to collect 7.5 crores in its first week which is great for a dubbing movie. Now, Hindi version of 'Vishwaroopam' is able to collect 7.75 crores and has surpassed the record created by Rajinikanth's 'Robot'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X