twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘విశ్వరూపం’ డిటిహెచ్ రిలీజ్ ఖరారు, ధర రూ. 1000

    By Bojja Kumar
    |

    చెన్నై : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రం 'విశ్వరూపం'. ఎన్నో అంచనాలతో కమల్ రూపొందించిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ కాక పోవడంతో...కమల్ హాసన్ సరికొత్త ఆలోచనతో డిటిహెచ్ ద్వారా నేరుగా టీవీల్లో ప్రీమియర్ షో ప్రదర్శించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    ఈ విషయంలో కమల్ హాసన్‌కు, సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మధ్య అనేక చర్చలు, వాదోప వాదాలు సైతం జరిగాయి. చాలా మంది దీన్ని వ్యతిరేకించగా...కొందరు నిర్మాతలు మాత్రం కమల్ హాసన్ నిర్ణయానికి మద్దతు పలికారు. ఏది ఏమైతేనేం తాజాగా తాజాగా ఈ షో తేదీ, టైం ఖరారైంది.

    సినిమా థియేటర్లలో విడుదల కావడానికి 12 గంటల ముందే ఎయిర్ టెల్ డిటిహెచ్ ద్వారా టీవీల్లో విడుదల చేస్తున్నారు. జనవరి 10వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఈషో ప్రదర్శించనున్నారు. అయితే ఇదేదో ఫ్రీ షో అనుకుంటే పొరపాటే. విశ్వరూపం సినిమాను థియేటర్లో విడుదలకు ముందు టీవీల్లో చూడానుకునే వారు రూ. 1000(ఒకసారి చూడటానికి) చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.

    ఈ మేరకు కమల్ హాసన్ ప్రెస్ స్టేటమ్ మెంట్ ఇచ్చారు. "ఎయిర్‌టెల్ డిటిహెచ్‌తో కలిసి సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. టెక్నాలజీ, ఎంటర్ టైన్మెంట్ కలగలిపిన సరికొత్త విధానానికి నాంది పలుకుతున్నాం. మా ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను. నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది టిడిహెచ్‌ల ద్వారా తమ ఇంట్లోనే సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.

    ఒక షోకు రూ. 1000 చార్జ్ చేయడాన్ని కమల్ హాసన్ సమర్థించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి థియేటర్లలో సినిమా చూడాలంటే.....టికెట్ చార్జీలతో పాటు, ట్రావెలింగ్, స్నాక్స్ అంతా కలిసి అంత కంటే ఎక్కువే అవుతోంది. ఇంట్లో కూర్చుని ఎంతో సౌకర్య వంతంగా చూడటానికి ఇదేమంత పెద్ద మొత్తం కాదు అని అంటున్నారు.

    English summary
    Vishwaroopam’s DTH premiere on January 10 at 9:30 PM : “I’m proud to be associated with Airtel DTH in this pioneering venture, which takes the combination of entertainment and technology to even greater heights. I’m very happy with the thought that many more viewers will be able to enjoy ‘Vishwaroop’/ ‘Vishwaroopam’ in the comfort of their homes,” Kamal Haasan said in a press statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X