ఈసారి ఏ టెన్షన్ లేదు.. కమల్ విశ్వరూపం-2కి సెన్సార్ క్లియరెన్స్

'విశ్వరూపం' సినిమా విడుదలకు దిగ్గజ నటుడు కమల్ హాసన్ అప్పట్లో ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. చుట్టూ వివాదాలు ముసురుకున్నవేళ.. ఒకానొక దశలో దేశం విడిచి వెళ్లిపోతానని కూడా కామెంట్ చేశారు.

కానీ విశ్వరూపం-2 సినిమా విషయంలో కమల్‌కు అలాంటి అవాంతరాలేవి ఎదురుకాలేదు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తాజా సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇటీవలే సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు 'విశ్వరూపం-2'కు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. చిత్ర యూనిట్ త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించనుంది.

vishwaroopam gets sensor clearance with UA certificate

ఇక సినిమా విషయానికొస్తే.. 'విశ్వరూపం-2'లో తొలి పార్ట్‌ను మించేలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. సినిమాలో పూజాకుమార్‌, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. రాహుల్‌ బోస్‌, శేఖర్‌కపూర్‌, నాజర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

రాజ్‌కమల్‌ ఫిలింస్ ఇంటర్నేషనల్‌ బేనర్‌పై కమలహాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారతీయుడు-2 చిత్రంలో నటిస్తున్నారు కమల్. 2019ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X