twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం' వాయిదా, కొలిక్కిరాని వివాదం

    By Srikanya
    |

    హైదరాబాద్: ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్న కమల్ హాసన్ 'విశ్వరూపం' అర్ధాంతరంగా వాయిదాపడింది. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి కమల్‌హాసన్ సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కమల్‌హాసన్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న డీటీహెచ్‌ విధానానికి తమిళనాట వ్యతిరేకత వ్యక్తమవుతోంది. థియోటర్స్ కంటే ముందుగా ఇంట్లోని టీవీల్లో 'విశ్వరూపం' చూపిస్తామంటే కుదరదు... అలా చేసిన పక్షంలో సహాయ నిరాకరణ చేస్తామని తమిళనాడు సినీ థియోటర్స్ సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 'విశ్వరూపం' చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకనిర్మాత, కథానాయకుడు కమల్‌హాసన్‌ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    కమల్‌ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ నెల 10వ తేదీ రాత్రి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో డీటీహెచ్‌ ద్వారా విడుదల చేస్తారు. 11వ తేదీ ఉదయం థియేటర్లలో విడుదలవుతుంది. ఈ విధానం మూలంగా థియేటర్లకు నష్టం వాటిల్లుతుందని ప్రదర్శనదారులు, పంపిణీదారులు నిరసన తెలిపారు. అయినా కమల్‌ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ముందుగా డీటీహెచ్‌లో విడుదల చేయాలనుకొనే నిర్మాతల చిత్రాలకు తమ థియేటర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దాంతో మంగళవారం ఉదయం నుంచీ చెన్నైలో థియేటర్ల యజమానులతో పలు దఫాలు కమల్‌, చలన చిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు చర్చలు సాగించారు. రాత్రి కమల్‌ నివాసంలో చర్చలు ముగిశాయి.

    అనంతరం తమిళనాడుసిని థియోటర్స్ సంఘం అధ్యక్షుడు కార్యదర్శి పన్నీర్‌ సెల్వమ్‌ మీడియా తో మాట్లాడుతూ ''చర్చలు సామరస్యపూర్వకంగా సాగాయి. మా డిమాండ్లకు సానుకూల స్పందన రాబోతుంది. ఈ చర్చల్లో కమల్‌ కొన్ని అంశాలు సూచించారు. వీటిని మా సంఘం సభ్యులతో బుధవారం చర్చించి ఓ నిర్ణయం తీసుకొంటాం. ఆ తరవాత తుది నిర్ణయం ఉంటుంది''అన్నారు.

    చెన్నై సిని థియోటర్స్ సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్‌ మాట్లాడుతూ ''చర్చలు చివరి దశకు చేరాయి. థియేటర్లవాళ్లకే అనుకూలంగా నిర్ణయం రావచ్చు'' అన్నారు. అలాగే పంపిణీదారులు కూడా డీటీహెచ్‌ విడుదలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తెరపైకి చిత్రం వచ్చిన రెండు వారాల తరవాతే డీటీహెచ్‌కి ఇవ్వాలన్నది వాళ్ల సూచన. అయితే డీటీహెచ్‌ నిర్వాహకులు మరో సూచన చేస్తున్నారు... 'తెరపైనా, డీటీహెచ్‌లోనూ ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుంది'అని. బుధవారం మధ్యాహ్నం కమల్‌హాసన్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    English summary
    
 With some sudden developments and issues with theatre owners in Tamilnadu, Kamal Haasan is forced to postpone the release of his magnum opus, Vishwaroopam. So, the film is not releasing on Jan 11th as announced earlier. The exact date of the new release date will be announced shortly. It is most likely to release on Jan 25th, on the eve of Indian Republic Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X