కోమా నుంచి బయిటపడ్డ 'విసు' సి.సి.రెడ్డి
{image-cc reddy_13092008.jpg telugu.filmibeat.com}విసు కన్సలటెన్సీ, విసు ఫిలింస్ అధినేత,ప్రభుత్వ రాజకీయ సలహా దారు అయిన సి.సి.రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో కేర్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలి బొటన వేలుకి సంభంధించిన గౌట్ వ్యాధితో ఆయన గత కొంత కాలంగా భాధ పడుతున్నారు. చాలా అరుదుగా వచ్చే ఈ కంప్లెయింట్ కి గత రెండు నెలలుగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్ధితి చేయి దాటటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈలోగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ కోమాలోకి వెళ్ళిపోయారు.
దాదాపు ఐదు రోజులు అనంతరం సేఫ్ గా బయిటపడ్డారు. దాంతో ఆయన మిత్రులు,కుటుంబ సభ్యులు,శ్రేయాభిలాషులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక నుంచీ చాలా స్ట్రిక్ట్ గా డైటింగ్ చేయాలని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని డాక్టర్లు హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన వ్యాపారాలు తో పాటు శ్రేయాభిలాషి వంటి సందేశాన్నిచ్చే పలు చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. వాటిల్లో టీ బిస్కట్ సమోసా స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుంటే, వై.యస్ తో మూకీ సినిమా ఇప్పటికే మొదలయింది. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుందాం.


Click it and Unblock the Notifications











