twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనే హీరో...అనుకున్న హీరోలంతా నశనమయ్యారు: దాసరి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడిని నమ్మిన ఏ హీరో చెడిపోలేదు, నేనే హీరో అనుకున్న ప్రతి హీరో నాశనం అయ్యాడు....అని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి ప్రస్థానంపై పాత్రికేయుడు వినాయకరావు రచించిన 'విశ్వ విజేత విజయగాథ' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్ స్టార్ కృష్ణ పుస్కకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రతాప్ ఆర్ట్స్ కె. రాఘవకు అందించారు. రూ. 3,01,116 కు వేలం పాటలో దాసరి కిరణ్ కుమార్ ఈ పుస్తకాన్ని దక్కించుకున్నారు. అనంతరం దాసరి మాట్లాడుతూ...తన సినిమా జీవితం గురించి నెమరు వేసుకున్నారు.

    Viswa Vijetha Vijaya Gatha Book Launch

    తాను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారు, ఆయన నన్ను నమ్మి అవకాశం ఇవ్వబట్టే ఈ రోజు ఇంత సాధించగలిగాను. అదృష్టానికి అందరి అడ్రసు తెలుసు. ఎప్పుడు ఎవరిని వరించాలో దానికి బాగా తెలుసు. మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అందుకు నా జీవితమే ఉదాహరణ అన్నారు దాసరి.

    దర్శకుడిని నమ్మిన ఏ హీరో చెడిపోలేదు. నేనే హీరో అనుకున్న ప్రతి హీరో నాశనమయ్యాడు. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ తనపై క్లాపు కొట్టే వరకూ 'బొబ్బిలి పులి' కథ వినలేదు. దర్శకుడిని అప్పట్లో అంతగా నమ్మే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా ఎన్ని వసూళ్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు. ఎన్నాళ్లు జనం గుర్తుంచుకున్నారనేదే ముఖ్యమని దాసరి చెప్పుకొచ్చారు. 'విశ్వ విజేత విజయగాథ' అనే పుస్తకం తన జీవిత చరిత్ర కాదని....నా దర్శకత్వంలో వచ్చిన 150 సినిమాల వెనక ఉన్న చరిత్ర. త్వరలో నా జీవిత చరిత్ర నేనే రాయబోతున్నాను అని దాసరి నారాయణరావు వెల్లడించారు.

    English summary
    Viswa Vijetha Vijaya Gatha Book Launch held at Hyderabad. Superstar Krishna, Dasari Narayana Rao, Paruchuri Venkateswara Rao, D.Suresh Babu, Boyapati Srinu, D.Ramanaidu, K.Viswanath, K.Raghavendra Rao, T.Subbarami Reddy, Kodi Ramakrishna, Jayasudha, Mohan Babu, Krishnam Raju, VV Vinayak, Tammareddy Bharadwaja, Babu Mohan, Ramesh Prasad graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X