twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?

    |

    తెలుగులో కొత్త సినిమా పంథా మొదలైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకులు, యంగ్ డైరెక్టర్ల మేకింగ్‌తో అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో శైలేష్ కొలను అనే దర్శకుడు తీసిన HIT సినిమా అందరినీ ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ యాక్టింగ్, బిగితో కూడిన కథనం అన్నీ కూడా బాగానే కలిసి వచ్చాయి. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన అప్డేట్ తాజాగా వచ్చింది.

    రీమేక్ కూడా..

    రీమేక్ కూడా..

    తెలుగులో HIT సినిమా సాధించిన విజయాన్ని అందరూ షాక్ అయ్యారు. ఏకంగా బాలీవుడ్ కన్ను కూడా పడింది. అందుకే ఈ సినిమాను రీమేక్ చేయాలని శైలేష్ కొలను వెంట పడ్డారు. అందుకే రాజ్ కుమార్ రావు హీరోగా హిందీలో ఈ మూవీ రీమేక్ కాబోతోంది.

    ఏడాది పూర్తయింది..

    ఏడాది పూర్తయింది..

    HIT సినిమా విడుదలై నేటికి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగానే HIT సీక్వెల్ అప్డేట్ ప్రకటించారు. ఇంతకంటే మంచి సందర్భం ఉంటుందా? అంటూ సీక్వెల్‌కు సంబంధించి నిర్మాత నాని ఓ హింట్ వదిలాడు. HIT సినిమా తెలంగాణ పోలీసుల నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సీక్వెల్ మాత్రం ఏపీ నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు ప్రకటించారు.

     కేడీ ఎవరు?

    కేడీ ఎవరు?

    మీరు తెలంగాణ HIT విక్రమ్ రుద్రమరాజును చూశారు.. మిమ్మల్ని సీటు అంచున కూర్చొబెట్టేలా చేశాడు.. అయితే ఇప్పుడు ఏపీ HIT కేడీ వంతు రాబోతోంది.. కేడీ ఎవరు? అంటూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాడు నాని. అయితే ఈ మేరకు అసలు ట్విస్ట్ బయటపడింది.

    ఆనాడే అలా..

    ఆనాడే అలా..

    HIT సినిమా సక్సెస్ మీట్‌లోనే విశ్వక్ సేన్ కొన్ని మాటలు వదిలాడు. చేసిన పాత్రనే మళ్లీ మళ్లీ చేయడం నాకు ఇష్టం ఉండవు అని చెప్పుకొచ్చాడు. అలా HIT సీక్వెల్‌లో విశ్వక్ సేన్ ఉండబోడని అప్పుడే అర్థమైంది. తాజాగా HIT సీక్వెల్ అప్డేట్‌పైనా విశ్వక్ సేన్ స్పందింస్తూ.. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు.

     అడివి శేష్ అంటూ..

    అడివి శేష్ అంటూ..

    అలా తాను నటించే పాటికైతే.. ఆల్ ది బెస్ట్ అని ఎందుకు చెబుతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ కేడీ మరెవరో కాదు.. అది అడివి శేష్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Viswak sen Not Interested in HIT Sequel,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X