twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్యం రాజేశ్‌ హీరో అనగానే పారిపోయారు.. ఆమె ఒక్కరే అండగా..

    By Rajababu
    |

    రాజ్‌కిరణ్‌ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'విశ్వామిత్ర'. నందితరాజ్‌, సత్యం రాజేశ్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో అశుతోష్‌ రాణా విడుదల చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్‌ ఉంది. అందుకు ఇక్కడివారు వివిధ విభాగాలను చక్కగా హ్యాండిల్‌ చేస్తున్నారు అని అశుతోష్ రాణా అన్నారు.

    టాలీవుడ్‌‌లో చాలా టాలెంట్ ఉంది

    టాలీవుడ్‌‌లో చాలా టాలెంట్ ఉంది

    ఈ సందర్భంగా .... అశుతోష్‌ రాణా మాట్లాడుతూ - ''తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్‌ ఉంది. అందుకు ఇక్కడివారు వివిధ విభాగాలను చక్కగా హ్యాండిల్‌ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే...నాకు మహిళలు లక్కీ ఎందుకంటే నా తొలి సినిమా దుష్మన్‌కి దర్శక నిర్మాతలు మహిళలే. ఈ సినిమాలో నందిత రాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాను. ఈ సినిమాలో నేను పొసెసివ్‌ భర్త పాత్రలో కనపడతాను. రాజ్‌కిరణ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు'' అన్నారు.

    హారర్‌, థ్రిల్లర్‌ జోనర్‌దే హవా

    హారర్‌, థ్రిల్లర్‌ జోనర్‌దే హవా

    చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్‌ మాట్లాడుతూ - ''ప్రస్తుతం హారర్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలదే హవాగా ఉంది. ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. అది ఇప్పటికి తీరింది. యు.ఎస్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆర్టికల్‌ చదివి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను తయారు చేసుకున్నాను. ఓ స్నేహితుడికి ఈ కథ చెప్పగానే.. ఇలా కూడా జరగుతుందా? అని అన్నారు. ఆయనే ఇలాంటి ఘటనే స్విజర్లాండ్‌లో కూడా జరిగిందని చెప్పారు. అప్పుడు నేను ఆ వివరాలను కూడా సేకరించాను. అలా యు.ఎస్‌, స్విట్జర్లాండ్‌ ఘటనల ఆధారంగా విషయాలను క్రోడికరించి ఈ కథను తయారు చేశాను.

     సత్యం రాజేష్ హీరో అనగానే

    సత్యం రాజేష్ హీరో అనగానే

    మాధవిగారు, రజనీకాంత్‌గారు నిర్మాతలుగా ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. వారు మొదటి సిట్టింగ్‌లోనే ఈ సినిమాను ఓకే చేశారు. సత్యంరాజేష్‌నే హీరో అని ఫిక్స్‌ అయ్యి కథను తయారు చేశాను. చాలా మంది హీరోయిన్స్‌ను కలిస్తే కథ బావుంది.. హీరో ఎవరు అని అడిగారు. సత్యం రాజేశ్‌ అని చెప్పగానే చాలా మంది డ్రాప్‌ అయ్యారు. కానీ నందితరాజ్‌ కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను. 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. నా మిత్రుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు మాటలను అందించారు. అలాగే మరో స్నేహితుడు బి.వి.ఎస్‌.రవిగారి సహకారం కూడా మరువలేనిది'' అన్నారు.

    నువ్వే హీరో అని..

    నువ్వే హీరో అని..

    సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ ''ఏడాదిన్నర క్రితం ఓ సందర్భంలో రాజ్‌కిరణ్‌గారు ఈ పాయింట్‌ చెప్పారు. బావుందని అన్నాను. దాంతో ఆయన కథను డెవలప్‌ చేశారు. ఓ రోజు ఫోన్‌ చేసి ఈ సినిమాలో నువ్వే హీరో అని అన్నారు. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్‌ కాదు. కానీ ప్రాముఖ్యత ఉన్న పాత్ర. నాకంటే అశుతోష్‌ రాణాగారు.. నందితగారు, మల్లిక్‌గారు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో కనపడతారు. అలాగే ఈ సినిమాకు మాటలు అందించిన వంశీకృష్ణగారికి థాంక్స్‌'' అన్నారు.

    నందితరాజ్‌ మాట్లాడుతూ ''చాలా మంచి కథ. ఈ కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే రాజ్‌కిరణ్‌, మాధవిగారు, రజనీకాంత్‌గారు.. అశుతోష్‌రాణాగారు, సత్యంరాజేశ్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

    సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాం

    సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాం

    నిర్మాత మాధవి మాట్లాడుతూ ''కథ వినగానే బాగా నచ్చడంతో సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేసేశాం. యు.ఎస్‌, స్విజర్లాండ్‌లో జరిగిన యదార్ధ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదొక థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీ. తెలుగు సినిమాల్లో రాని కథాంశంతో వస్తోన్న సిశ్రీనిమా'' అన్నారు.

    ఫ్యామిలీ థ్రిల్లర్

    ఫ్యామిలీ థ్రిల్లర్

    వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ ''నేను డైరెక్టర్‌ కావడానికి ముందు రైటర్‌ని. నాకు ఈ సినిమాలకు మాటలు అందించే అవకాశం ఇచ్చిన నా స్నేహితుడు, దర్శకుడు రాజ్‌కిరణ్‌కి థాంక్స్‌. ఈ సినిమాలో క్లైమాక్స్‌ మరే సినిమాలో రాలేదు. ఫ్యామిలీ థ్రిల్లర్‌'' అన్నారు.

     భయం కలిగించేలా ఉంది

    భయం కలిగించేలా ఉంది

    బి.వి.ఎస్‌.రవి మాట్లాడుతూ ''నిజం ఒక్కొక్కసారి అబద్ధం కంటే భయం కలిగించేదిగా ఉంటుంది. హారర్‌ కామెడీ జోనర్‌ సినిమాలకు నాంది పలికిన రాజ్‌కిరణ్‌గారు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది'' అన్నారు.

    ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, సినిమాటోగ్రఫీ: అనిల్‌ భండారి, ఎడిటర్‌ ఉపేంద్ర, యాక్షన్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, ఆర్ట్‌: చిన్నా, కో డైరెక్టర్‌: విజయ్‌ చుక్కా, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌, దర్శకత్వం: రాజ్‌కిరణ్‌.

    English summary
    #Viswamitra, based on an unbelievable true story, which happened in US, launched Directed by RajKiran of 'Geethanjali' & 'Tripura' fame, starring Nandita Raj, Satyam Rajesh, VidyuRaman, Ashutosh Rana among others.Dialogues-Vamsi Akella Produced by Madhavi A & Rajinikanth S
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X