Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
16న కె. విశ్వనాధ్ 'శుభ్రప్రదం' విడుదల
నరేష్, మంజరి జంటగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రై.లి. సమర్పణలో శ్రీ రాజరాజేశ్వరి సోమేశ్వర పొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'శుభప్రదం' చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన హరిగోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ ' వయసును లెక్క చేయకుండా నేటి యువ దర్శకులతో సమానంగా శ్రమ పడుతూ అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం చిత్రాన్ని విశ్వనాథ్‌గారు చిత్రాన్ని పూర్తి చేశారు.
ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్‌కు చెరుకూరి కౌసలేంద్రరావుగారు వెన్నుదన్నుగా నిలవడం మా అదృష్టం. విశ్వనాథ్‌గారి గత చిత్రాలైన 'ఓ సీత కథ", 'శుభోదయం', 'శుభలేఖ' చిత్రాల కోవలో సునిశిత హాస్యంతో ఉండే సినిమా ఇది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. సంగీత, సాహిత్యాలకు సినిమాలో ప్రాధాన్యత ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విశ్వనాథ్‌గారు చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుందని, చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందని నమ్మకం ఉంది' అన్నారు.