కమల్ హాసన్ వెనకడుగు-మహేష్, చెర్రీలే కారణం!
తాజాగా అందిన సమాచారం ప్రకారం సంక్రాంతి బరి నుంచి ఈ చిత్రం తప్పుకుంది. అయితే తమిళం, హిందీ వెర్షన్లలో మాత్రం ముందుగా అనుకున్న తేదీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ విడుదల మాత్రమే వాయిదా వేసారు. జనవరి చివరి వారంలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలోగానీ ఆంధ్రప్రదేశ్‌లో 'విశ్వరూపం' విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలుగు అదే సమయానికి మహేష్-వెంకీ కాంబినేషన్లో రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు, వివి వినాయక్-రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందిన 'నాయక్' చిత్రం విడుదలవుతుండటంతో వాటితో పోటీ పడటం ఇష్టం లేకనే కమల్ హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నన్ని థియేటర్లు దొరకక పోవడం కూడా ఓ కారణం.
మరో వైపు... ఎన్నో అంచనాలతో కమల్ రూపొందించిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ కాక పోవడంతో... కమల్ హాసన్ సరికొత్త ఆలోచనతో రంగంలోకి దిగారు. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడంతో పాటు.... ఓ ప్రముఖ డిటిహెచ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా టీవీల్లో కూడా సినిమాను విడుదల చేయాలని, తద్వారా తను అనుకున్న మొత్తం రాబాట్టాలని ప్లాన్ చేసారు.


Click it and Unblock the Notifications












