twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ లేపిన విశ్వాసం, మహర్షి... బాలీవుడ్ సినిమాలను వెనక్కి తోశాయి!

    |

    ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే యాష్ ట్యాగ్(#) ఉపయోగించి వెతుకుతాం. యాష్ ట్యాగ్(#) ద్వారా సెర్చ్ చేసే విధానం 12 సంవత్సరాల క్రితం ట్విట్టర్లో మొదటగా ప్రారంభం అయింది. తర్వాత ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ తరంలో అత్యధికంగా ఉపయోగించే సింబల్ కూడా ఇదే.

    ట్విట్టర్ సంస్థ యాష్ ట్యాగ్ సెలబ్రేషన్లో భాగంగా శుక్రవారం ఓ జాబితా విడుదల చేసింది. 2019 ప్రథమార్థంలో సోషల్ మీడియాలో అత్యధికంగా సర్వ్కులేట్ అయిన టాప్ 5 యాష్ ట్యాగ్స్‌ ఏమిటో వెల్లడిస్తూ వివరాలు విడుదల చేసింది.

     Viswasam and Maharshi in top: Twitter unveiled top hashtags in 2019

    ఈ ఏడాది దేశంలో ప్రధానంగా చర్చనీయాంశమైన టాపిక్స్ లోక్ సభ ఎన్నికలు, క్రికెట్ వరల్డ్ కప్ 2019. అయితే ఈ రెండింటినీ అధిగమించి 'విశ్వాసం' అనే సినిమా ముందు ఉండటం గమనార్హం. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని ప్రపంచ దేశాలు భావిస్తాయి. అయితే టాప్ ట్విట్టర్ ట్రెండింగులో ఒక్క బాలీవుడ్ పేరు కూడా లేక పోవడం గమనార్హం. టాప్ 5లో రెండు స్థానాలు సౌత్ చిత్రాలే దక్కించుకున్నాయి.

    మొదటి స్థానంలో విశ్వాసం(#Viswasam), రెండో స్థానంలో లోక్ సభ ఎన్నికలు (#LokSabhaElections2019), మూడో స్థానంలో క్రికెట్ వరల్డ్ కప్ ట్యాగ్ (#CWC19) నిలిచింది. 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ మూడు అంశాల గురించే జనం ట్విట్టర్లో ఎక్కువగా వెతికారట.

    మన తెలుగు సినిమా మహర్షి(#Maharshi ) 4వ స్థానం దక్కించుకోవడం విశేషం. 5వ స్థానంలో #NewProfilePic అనే యాష్ ట్యాగ్ నిలిచింది. టాప్ సెర్చలో విశ్వాసం, మహర్షి సినిమాలు ఉండటం బట్టి ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఏ స్థాయిలో ట్విట్టర్లో తమ హవా కొనసాగించారో అర్థం చేసుకోవచ్చు.

    English summary
    Twitter Friday unveiled top hashtags. It revealed that #Viswasam, #LokSabhaElections2019, #CWC19, #Maharshi, #NewProfilePic amongst others were the most tweeted hashtags in first half of 2019 in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X