Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘విశ్వాసం’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీలా... అజిత్ సినిమాలకు డిమాండ్ లేదా?
తమిళ స్టార్ అజిత్ నటించిన 'విశ్వాసం' సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో విడుదలై సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ 'పేట'తో పోటా పోటీగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లకుపైనే వసూలు చేసింది.
సంక్రాంతి సందర్భంగా తెలుగునాట థియేటర్ల సమస్య ఉండటంతో ఇక్కడ విడుదల సాధ్యం కాలేదు. మార్చి 1న సినిమాను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువ జరుగడం విస్మయానికి గురి చేస్తోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగులో అన్ని ఏరియాలకు కలిపి ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 2.60 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు తెలుగులో విడుదలైన అజిత్ సినిమాలు వివేకం(రూ. 5.5 కోట్లు), ఆట ఆరంభం(రూ. 4 కోట్లు)తో పోలీస్తే ఇది చాలా తక్కువ.
అజత్ సినిమాలకు డిమాండ్ తగ్గిందా?
అజిత్ నటించిన సినిమాలకు తెలుగులో పెద్దగా ఆదరణ లేక పోవడం, వివేకం, ఆట ఆరంభం చిత్రాలకు ఇక్కడ ఆశించిన స్థాయిలో లాభాలు రాక పోవడంతో ‘విశ్వాసం' థియేట్రికల్ రైట్స్ ఇంత తక్కువ మొత్తం రావడానికి కారణంగా తెలుస్తోంది.
సిరుతై శివ
వీరం, వేదాలం, వివేగం సినిమాలను తెరకెక్కించిన సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్ సరికొత్త మాస్ లుక్‌తో తన విశ్వరూపం చూపించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ కావడంతో మాస్కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.
విశ్వాసం
అజిత్ సరసన నయనతార హీరోయిన్గా నటించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. సత్యరాజ్, ప్రభు గణేశన్, సంపత్‌రాజ్, యోగిబాబు, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందించారు.