twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్ ఓ వైపు, ఫిఫా వరల్డ్ కప్ ఓ వైపు.. రాంచరణ్, వివేక్ ఒబెరాయ్ ఏం చేస్తున్నారంటే!

    |

    Recommended Video

    Ram Charan & Vivek Anand Oberoi Watches Football Match

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. రంగస్థలం వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ సెట్స్ లో మంచి సాన్నిహిత్యంతో మెలుగుతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా వీరిద్దరూ సెట్ లో ఆసక్తికరమైన కార్యక్రమం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

     క్రీడలంటే అభిమానం

    క్రీడలంటే అభిమానం

    సినిమా నటులు చాల మంది క్రీడల పట్ల ఆసక్తి చూపించడం చూస్తూనే ఉన్నాం. విక్టరీ వెంకటేష్ ఎక్కువగా క్రికెట్ స్టేడియంలో దర్శనమిస్తుంటారు. రాంచరణ్, వివేక్ ఒబెరాయ్ ఇద్దరూ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులపై అత్యంత ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తోంది.

     ఇద్దరూ కలసి

    ఇద్దరూ కలసి

    వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ ఇద్దరూ కలసి ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచులు చూసినట్లు తెలుస్తోంది. వీరితో బోయపాటి శ్రీను కూడా కలిశారట. ప్రతి మ్యాచ్ ని మిస్ కాకుండా చూడడానికి ప్రాధాన్యత ఇచ్చారట.

    ఫైనల్ కోసం ప్లానింగ్

    ఫైనల్ కోసం ప్లానింగ్

    ఆదివారం రోజు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ని సినిమా సెట్ లోనే చూసేందుకు రాంచరణ్, వివేక్ ఒబెరాయ్ ఏరాప్టులు చేసుకుంటున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

    బోయపాటి సినిమా

    బోయపాటి సినిమా

    ఇక సినిమా విషయానికి వస్తే బోయపాటి చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బోయపాటి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్.

    English summary
    Vivek Anand Oberoi and Ram Charan bond over football. Ram Charan doing arrangements for Fifa World Cup
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X