రక్తచరిత్ర హీరో వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు
రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌పై ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగడం నేరం. ఈ నిబంధనను ఉల్లంఘించి పబ్లిక్ ప్లేసులో స్మోక్ చేసిన వివేక్ ఒబెరాయ్‌పై టొబాకో ఆక్ట్ 4ఆర్‌డబ్లు(21) ప్రకారం ఆయనపై కేసు నమోదు చేశారు. ముంబై సబర్భన్‌లోని ఓ రెస్టారెంట్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీ చేయగా అదే సమయంలో అక్కడ పొగతాగుతున్న వివేక్, మరో 23 మంది స్మోకర్లపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. అయితే తాను స్మోక్ చేయలేని, పోలీసులు తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని, తను స్మోక్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఓబెరాయ్ వాదిస్తున్నాడు.
ఇక్కడ మనం గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే...వివేక్ ఒబెరాయ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న యాంటీ స్మోక్ కాంపెయిన్‌కి ఈహీరో బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











