పరిటాల రవి పాత్ర అద్భుతంగా పోషించిన వివేక్ ఒబేరాయ్ కి క్వాలిస్ కాన్వాయ్...
వివి వినాయక్, బి గోపాల్ తెరకెక్కించిన చాలా ఫ్యాక్షన్ సినిమాల్లా సూమోలు గాల్లో ఎగరడం.. పదుల సంఖ్యలో సఫారీలూ కాన్వాయ్ గా వెళ్లుండడం అప్పట్టో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చాయి. సినిమాల్లో సంగెతెలా ఉన్నా, రియల్ లైఫ్ లో అనంతపురం ప్రజానీకం అలాంటి అనుభూతికే లోనుకానున్నారు. ఈ రోజు అనంతపురం జిల్లాకు ఎళ్ళనున్న 'రక్త చరిత్ర" టీమ్, సుమారు 60 క్వాలిస్ లతో కాన్వాయ్ ని ఏర్సాటు చేసుకోవడమే ఇందుకు కారణం.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, 'రక్త చరిత్ర" నిర్మాత సి కళ్యాణ్ సహా 'రక్తచరిత్ర"కు సంబంధించిన యూనిట్ సిబ్బంది ఈ రోజు అనంతపురం వెళ్లనున్న సంగతి విదితమే. ఇందుకోసం భారీగా కాన్వాయ్ ని ఏర్సాటు చేశారు దర్శక నిర్మాతలు. అనంతపురం జిల్లా వెంకటాపురం వెళ్ళి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి ఘాట్ వద్ద నివాళులర్పించేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అసలే, సినిమాపై వెల్లువెత్తుతున్న వివాదాల నేపథ్యంలో ఈ టూర్ కాస్తా రసా బాసగా మారే అవకాశముందని ఓ పక్క విమర్శలు వెలువెత్తుతోంటే, వివాదాలు సద్దు మణగడానికే ఈ కార్యక్రమమని సినిమా తరపున అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఇదంతా పబ్లిసిటి స్టంట్ అనీ, ఏ చిన్న వివాదం తలెత్తినా, అది సినిమా పబ్లిసిటీకి మరింత ప్లస్ అవుతుందని సినీ జనం కామెంట్లు విసురుతున్నారు.మరి వివేక్ ఓబేరాయ్ అనంత టూర్ ఎలా సాగుతోందో వేచిచూడాల్సిందే....


Click it and Unblock the Notifications











