రాంచరణ్‌తో యుద్ధం, గుర్రాలతో భారీగా.. మామూలు సినిమా కాదుగా, అంచనాలు పెంచేసిన వివేక్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. రంగస్థలం తరువాత బోయపాటి సినిమాని చరణ్ ఒకే చేశాడు. దీనితో ఈ సారి రాంచరణ్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడని అభిమానులు భావించారు. కాని ఇది సాదాసీదా మాస్ ఎంటర్ టైనర్ కాదని అర్థం అయిపొయింది. కళ్ళు చెదిరే యాక్షన్ తో చరణ్ ఉర్రూతలూగించబోతున్నాడని తాజాగా వివేక్ ఒబెరాయ్ చేసిన ట్వీట్ తో తేలిపోయింది.

అజర్బైజాన్
25 రోజులు భారీ షెడ్యూల్ కోసం రాంచరణ్, బోయపాటి సినిమా యూనిట్ అద్భుతమైన అజార్బైజాన్ దేశానికీ వెళ్లారు. ఈ షెడ్యూల్ పై వివేక్ ఒబెరాయ్ తాజగా ట్వీట్ చేశాడు. అజర్బైజాన్ దేశం పౌరుషానికి ప్రతీక అని అభివర్ణించాడు.
Recommended Video


సీట్ ఎడ్జ్ మీద
వివేక్ ఒబెరాయ్ చేసిన ట్వీట్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. అద్భుతమైన టాలెంట్ ఉన్న బ్రదర్ రాంచరణ్ తో ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. మాస్టర్ డెరెక్టర్ బోయపాటి చంపేస్తున్నాడు. సీట్ ఎడ్జ్ మీద కూర్చుని ఎంజాయ్ చేసే ఈ చిత్రం కోసం రెడీగా ఉండండి అంటూ ట్విటర్ లో స్పందించారు.
అంచనాలు పెంచేలా
షూటింగ్ లొకేషన్ లో తాను ఉన్న ఫోటోని కూడా వివేక్ షేర్ చేశాడు. భారీగా విలన్లు, గుర్రాలు, పెద్ద దుంగలు కనిపిస్తున్నాయి. సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ అజర్బైజాన్ లో తెరకెక్కించనున్నారు. వివేక్ ట్వీట్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

ఫస్ట్ లుక్
కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. త్వరలో ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











