పెళ్సిచేసు కోబోతున్న రక్తచరిత్ర హీరో పరిటాల రవి(వివేక్ ఒబేరాయ్)..
నేడు బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ పెళ్లి ... రక్త చరిత్రలో పరిటాల రవి పాత్రతో ఇటీవలే దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్.. ప్రియాంకా ఆల్వా అనే అమ్మడి మెడలో ఇవాళ మూడు ముళ్లు వేయనున్నాడు. ఉదయం 8.30కు బెంగళూరులోని ఆల్వా ఇంట్లో పెళ్లి తంతు మొదలవుతుంది. రాత్రి 11 గంటల వరకు సంబరాలు జరుగుతాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ బాలే నృత్య కళాకారిణి నందినీ ఆల్వా, జేడీ(యూ) దివంగత నేత జీవరాజ్ ఆల్వాల ముద్దుల కూతురు ప్రియాంకా ఆల్వా. ఆమె లండన్ లో బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చేసింది.
కర్ణాటక సీఎం యడ్యూరప్ప ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆదివారం ముంబైలోని ఓ స్టార్ హోటల్లో జరిగే రిసెప్షన్ కు బాలీవుడ్ యావత్తు హాజరవుతోంది. వివేక్ స్నేహితురాళ్లు సుస్మితాసేన్, దియామీర్జా తదితరులు పెళ్లికి కూడా వచ్చే అవకాశముంది. ఇక ఒబెరాయ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించడంతో బాలీవుడ్ రారాణి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కూడా పతీ సమేతంగా బెంగళూరు వస్తుందని భావిస్తున్నారు. చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్ కూడా పెళ్లికి వెళ్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











