'రక్త చరిత్ర' హీరో హానీమూన్ ట్రిప్ టీవీ కవరేజ్ వివాదం
రక్త చరిత్ర చిత్రం ద్వారా తెలుగులో సైతం క్రేజ్ సంపాదించుకున్న వివేక్ ఒబారాయ్ రీసెంట్ గా ఓ టీవి ఛానెల్ పై తన ఆగ్రహం వెళ్ళగక్కాడు. కొత్తగా పెళ్ళి చేసుకున్న ఈ హీరో హానీమూన్ ట్రిప్ ని కవరేజ్ చేయటానికి హక్కుల అడిగితే ఎక్కువ మొత్తం డిమాండ్ చేసాడంటూ అదే ఓ టీవీ ఛానెల్ లో పోగ్రాం వచ్చింది. దాంతో నేను ఎలా కనపడుతున్నాను..ఎవరన్నా హానిమూన్ కి వెళ్ళేటప్పుడు టీవీ కవరేజ్ తీసుకు వెళ్థారా అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే తనకున్న క్రేజ్ చుట్టూ ఏదో స్టోరీ అల్లి క్యాష్ చేసుకుందామనేదే ఆ టీవీ ఛానెల్ ప్రయత్నం అని స్పష్టం చేస్తున్నారు.
అయితే టీవీ ఛానెల్ వారు మాత్రం మంచో, చెడో మేం హానీమూన్ ట్రిప్ రైట్స అడగటం అనేది నిజం, అయితే అతను అంత ఎక్కువ డిమాండ్ చేస్తాడని మేం ఊహించలేదు అంటున్నారు. ఇక అక్టోబర్ లో రక్త చరిత్ర రిలీజ్ సమయంలో వివాహం చేసుకున్న వివేక్ ఒబరాయ్...ఇన్నాళ్ళకు ఖాళీ దొరకటంతో...హనీమూన్ నిమిత్తం రెడ్ సీకు వెళ్ళుతున్నారని, ముంబయ్ లో తమ ప్రయాణం మొదలుపెట్టినప్పట్నుంచి రెడ్ సీ వరకు...అక్కడ సైట్ సీయింగ్ కు వెళ్లినప్పుడు, విందు ఆరగిస్తున్నప్పుడు కవరేజ్ చేసుకోవడానికి ఓ టీవీ ఛానల్ కు వివేక్ మొదట అనుమతి ఇచ్చారని, ఇప్పుడు ప్లేట్ ఫిరాంయించాడని బాలీవుడ్ లో వినపడుతోంది. ఇక ఈ వార్తను ఆ టీవీ ఛానలే ప్రసారం చేసినందుకు...వివేక్ సదరు ఛానల్ కు లీగల్ నోటీసు పంపాలనుకుంటునే నిర్ణయం తీసుకున్నాడు.


Click it and Unblock the Notifications











