రాంచరణ్ సినిమా స్టోరీ, అంత క్రూరమైన పాత్రలోనా..ఇంట్రడక్షన్ సీన్ రచ్చే..?

Recommended Video

Vivek Oberoi's Role In Ram Charan Movie

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందే చరణ్ బోయపాటితో సినిమాని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి సంబందించిన లీకులు అప్పుడే మొదలయ్యాయి. రంగస్థలం చిత్రం ఈ నెల 30 న విడుదలకు సిద్ధం అవుతోంది. రంగస్థలం పై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో చరణ్ తదుపతి చిత్రాన్ని చేయనుండడం విశేషం.బోయపాటి చిత్రంలో భారీ తారాగణం నటించబోతోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. వివేక్ పాత్రకు సంబందించిన ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

రంగస్థలంపై భారీ అంచనాలు

రంగస్థలంపై భారీ అంచనాలు

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చరణ్ ఈ చిత్రంలో పల్లెటూరి యువకుడిగా, వినికిడి లోపం ఉన్న పాత్రలో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

బోయపాటి సినిమా మొదలు

బోయపాటి సినిమా మొదలు

రంగస్థలం చిత్ర విడుదలకు ముందే బోయపాటి సినిమాని రాంచరణ్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

2017 లో కనిపించని చరణ్

2017 లో కనిపించని చరణ్

2016 లో విడుదలైన ధృవ చిత్రం తరువాత రాంచరణ్ మరో చిత్రంలో నటించలేదు. 2017 లో చరణ్ అభిమానులని నిరాశలే మిగిలింది. చరణ్ సినిమా ఏదీ గత ఏడాది విడుదల కాలేదు.

చక చకా సినిమాలు

చక చకా సినిమాలు

అందుకే ఈ ఏడాది సినిమాలు విషయంలో చురుగ్గా వ్యవహరించాలని రాంచరణ్ భావిస్తున్నారు.

బోయపాటి సినిమా గురించి ఆసక్తికర విషయాలు

బోయపాటి సినిమా గురించి ఆసక్తికర విషయాలు

బోయపాటి చిత్రం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంకోసం బోయపాటి భారీ తారాగణాన్ని సిద్ధం చేశారు.

విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్

విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అతిక్రూరంగా

అతిక్రూరంగా

వివేక్ ఒబెరాయ్ పాత్ర గురించి మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. వివేక్ విలన్ పాత్రలో అత్యంత క్రూరంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం వివేక్ ఒబెరాయ్ ఇంట్రడక్షన్ సీనే అదిరిపోయేలా ఉండబోతోందట. వివేక్ పాత్రలోని క్రూరత్వాన్ని చూపించేలా పరిచయ సన్నివేశంలోనే 25 మందిని కార్లతో తొక్కించే సన్నివేశం ఉంటుందని అంటున్నారు.

కారణం అదే

కారణం అదే

వివేక్ పాత్రని బోయపాటి ఇంత క్రూరంగా మలచడానికి కారణం ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర బలంగా ఉన్నప్పుడే, హీరో పాత్రలోని పవర్ బయటకు వస్తుందనేదని బోయపాటి ఫార్ములా.

దసరాకు విడుదల

దసరాకు విడుదల

రాంచరణ్, బోయపాటి చిత్రం దసరాకు విదులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే నిజమింతే ఈ ఏడాది రాంచరణ్ అభిమానులకు డబుల్ ధమాకానే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X