‘రక్త చరిత్ర’ హీరో వివేక్ ఒబెరాయ్ తండ్రయ్యాడు
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రక్త చరిత్ర' ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తండ్రయ్యాడు. వివేక్ భార్య ప్రియాంక మంగళవారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వివేక్ ఒబెరాయ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మా ఇద్దరి జీవితంలోకి దేవదూత వచ్చాడు. మాకు ఎంతో అంతమైన, ఆరోగ్యకరమైన మగ బిడ్డ జన్మించాడు. నా కొడుకును ఆశీర్వదించండి' అంటూ వివేక్ ఒబెరాయ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. కొన్ని రోజుల క్రితమే వివేక్ ఒబెరాయ్ తాను తండ్రి కాబోతున్న విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
రక్త చరిత్ర సినిమా తర్వాత వివేక్ ఒబెరాయ్ మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో పలు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. మల్లికా షెరావత్‌తో కలిసి 'కిస్మత్ లవ్ పైసా దిల్లి' చిత్రంతో పాటు, జిల్లా గజియాబాద్, క్రిష్ 3, జయంతా భాయ్‌కి లవ్ స్టోరీ, గ్రాండ్ మస్తి చిత్రాల్లో నటిస్తున్నాడు. అదే విధంగా దేఖ్ ఇండియన్ సర్కస్ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












