»   » పరిటాల రవి సమాధివద్ద నివాళులర్పించిన వివేక్ ఒబెరాయ్

పరిటాల రవి సమాధివద్ద నివాళులర్పించిన వివేక్ ఒబెరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివేక్ ఒబెరాయ్‌ కు అనంతపురంలోని పరిటాల రవి వర్గీయులు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అయితే రామ్ గోపాల్ వర్మ పరిటాల రవి పాత్రను మలచడంలో తమకు పూర్తి అసంతృప్తిని కలిగించిందని అన్నారు. పరిటాల రవి సమాధిని సందర్శించేవారు ఎవరినైనా తాము ఘనంగా స్వాగతం పలుకుతామని అన్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రం రక్తచరిత్రలో పరిటాల రవి పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ అనంతపురంలోని వెంకటాపురంలో పరిటాల రవి సమాధివద్దకు చేరుకుని రవికి నివాళులర్పించారు. ఒబెరాయ్ పరిటాల రవిలానే వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నుదుట బొట్టు పెట్టుకుని అభిమానుల కోలాహలం మధ్య రవి ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వివేక్‌ ఒబేరాయ్‌ మాట్లాడుతూ...అనంతపురం ప్రజలకు నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడాడు. రవిగారి పాత్ర పోషించడం నాకు చాలా సంతోషంగా వుంది. రవిగారి లాంటి గొప్ప వ్యక్తి క్యారెక్టర్‌ ను పోషించే ఛాన్స్‌ కల్పించిన వర్మగారిని థ్యాంక్స్‌. 'రక్త చరిత్ర" సినిమా ఇంతమంది ప్రేక్షకుల ఆదరణ పొందటం నాకు చాలా చాలా సంతోషంగా వుంది" అన్నారు. వివేక్ ఒబెరాయ్ పరిటాల సునీతను కలిసి మాట్లాడారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu