twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    15 నుండి వైజాగ్ ఫిల్మ్ ఫెస్టివల్

    By Bojja Kumar
    |

    విశాఖపట్నం: తెలుగు టాకీ సినిమా 83 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ప్రకటించింది. ఈ మేరకు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

     Vizag Film Society organizing Three day film festival

    ఈ సందర్భంగా ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశ్ రావు మాట్లాడుతూ...2014 సెప్టెంబర్ 15 నాటికి తెలుగు టాకీ సినిమాకి 83 సంవత్సరాలు పూర్తవుతాయని తెలిపారు. నాటితరం మహానుభావులు ఎంతో మంది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశిష్ట సేవలందించారన్నారు. వారి త్యాగఫలమే మనం ఇపుడు అనుభవిస్తున్నామన్నారు.

    నేటి తరానికి ఆ మహానుభావుల కృషిని తెలియజేసేందుకు మూడు రోజుల పాటు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో 1937లో గూడపల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రైతుబిడ్డ' చిత్రాన్ని, 16న తెలుగు సినిమాకు సంస్కారమద్దిన ‘సాక్షి' చిత్రాన్ని, 17న సాయంత్రం 6 గంటలకు ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అంకురం' చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని తెలిపారు.

    English summary
    The Vizag Film Society (VFS) is organizing a three day film festival on September 15 on the occasion of the 83rd anniversary of first Telugu Talkie cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X