twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యను మేము ఎలా పిలుస్తాం.. సీ కళ్యాణ్ వ్యాఖ్యలపై నరేష్ కామెంట్స్

    |

    నందమూరి బాలకృష్ణ సినీ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ పెను సంచలనం సృష్టించాయి. భూములు పంచుకుంటున్నారని ఆరోపించడం తెగ వైరల్ అయింది. బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి తలసాని కూడా స్పందించాడు. సినీ ప్రముఖులు కూడా ఆ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. అయితే బాలయ్య వ్యాఖ్యలు వైరల్ కాగానే మొదటగా నిర్మాత సీ కళ్యాణ్ స్పందించాడు. బాలయ్య వ్యాఖ్యలకు మద్దతిస్తూ చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపుతున్నాయి.

    సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. షూటింగుల కోసం నిర్మాతలుగానే తాము ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని కల్యాణ్ తెలిపారు. బాలయ్య ప్రస్తుతం నిర్మాతగా ఏ చిత్రాన్ని చేయడం లేదని చెప్పారు. అవసరమైనప్పుడు మాత్రమే బాలయ్య తమతో చర్చల్లో పాల్గొంటారని అన్నారు.

    VK Naresh Counter To C Kalyan Comments On Balakrishna

    ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని బాలయ్యకు తానే స్వయంగా చెప్పానని తెలిపారు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని... ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవని అన్నారు. ఎవరికి ఉండాల్సిన గౌరవం వారికి ఉంటుందని చెప్పారు. అయితే బాలయ్యను పిలవాల్సిన బాధ్యత మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) పైనే ఉందని అన్నాడు.

    సీ కళ్యాణ్ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. ఆయన మాటలు విని షాక్ అయ్యాను.చిరంజీవి, కేసీఆర్‌లతో జరిగిన మీటింగ్‌కు బాలయ్యను పిలవాల్సిన బాధ్యత 'మా'ది అనడం వింతగా ఉందని చెప్పుకొచ్చాడు. మా అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీకి గానీ నాకు గానీ ఆ విషయం గురించి సమాచారం లేనప్పుడు తాము ఎలా బాలయ్యను పిలుస్తామని వివరణ ఇచ్చాడు.

    English summary
    vVK Naresh Counter To C Kalyan Comments On Balakrishna. he says that Iam shocked seeing statement of mr c. Kalyan That it was maa’s responsibility to invite Mr balkrishna to the meetings with Mr Chiranjivi or Cm garu . As President of Maa , when Gen Secratary nor me was not informed of any such meetings how can I invite someone to meetings .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X