పవిత్ర లోకేష్ రూపంలో అమ్మ దొరికింది.. రియల్ లైఫ్ బాగాలేదు.. వీకే నరేష్ భావోద్వేగం
ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేష్ నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్‌కుమార్, శరత్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రం మే 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు వీకే నరేష్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ...
నా జీవితం ఎన్నో అనుభూతులతో: వేదికను అలంకరించిన నాలో సగభావం. నా అభిమానులు, మూవీ ఆర్టిస్టుల సంతోషం సహకారంతో ముందుకు సాగుతున్నాను. రీల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు రియల్ లైఫ్ గురించి మాట్లాడాలి. నా బాల్యం లో ఉదయమే మేకప్ వేసుకొనే కృష్ణ, విజయ నిర్మల గారిని చూస్తూ పెరిగాను.
వారు వేసుకొనే మేకప్ నాకు మంచి వాసనను ఇచ్చేది. ఉదయమే తిరుపతి నుంచి నున్నటి గుండ్లతో అభిమానులు వస్తే కృష్ణ, విజయ నిర్మల వారిని అక్కున చేర్చుకొనే వారు. అలా నా జీవితం ఎన్నో అనుభూతులతో మొదలైంది అని వీకే నరేష్ అన్నారు.
పండంటి కాపురం సినిమాతో: నేను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు పండంటి కాపురం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో నాతోపాటు నా అక్కయ్య జయసుధ కూడా ఆ సినిమాలో నటించింది. మా ఇద్దరి ప్రయాణం సినీ పరిశ్రమలో 50 ఏళ్లు. నాకు ఫస్ట్ మేకప్ వేసిన మాధవరావు, రాము టచప్ అసిస్టెంట్ వేసిన విషయాన్ని ఇప్పటికీ మరిచిపోలేను. ఎస్వీ రంగారావు, గుమ్మడి, కృష్ణ, జమున, విజయనిర్మలతో కలిసి ప్రయాణం మొదలుపెట్టడం గర్వంగా ఉంది అని వీకే నరేష్ చెప్పారు.

మా అమ్మ అలా బాధపడింది: నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరికో మంచి చేయడానికి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. కానీ అది ఎవ్వరికి లాభం చేయలేదు. మరోసారి నా జీవితంలో మంచి చేయాలని నిర్ణయం తీసుకొంటే.. ఆ కోరిక కలగానే మిగిలిపోయింది.
మరోసారి మంచి చెద్దామని అనుకొంటే.. చెడు ఎక్కువగా జరిగింది. మా అమ్మ చివరగా నాకు చెప్పింది.. నేను అన్నీ ఇచ్చాను. రాజును చేశాను. కానీ మంచి జీవితం ఇవ్వలేకపోయానని బాధపడింది. అయితే ఫర్వాలేదు. కానీ నేను నీ తర్వాత మరో అమ్మను కలిశానని గర్వంగా చెప్పాను అంటూ పవిత్రా లోకేష్‌ను చూపించారు.

కృష్ణ గారిలో ఉండే ధైర్యం: పవిత్రా లోకేష్, నేను కృష్ణ గారి ఆశీస్సులు తీసుకొని జీవితాన్ని ప్రారంభించాం. సినిమాలో ఫస్టాఫ్ బాగా లేకుంటే సెకండాఫ్‌ను లేపలేం. ఫస్టాఫ్ బాగుంటే.. సెకండాఫ్ ఇంకా బాగుంటుంది. మా అమ్మలో ఉండే మొండితనం, పట్టుదల, బలం నాకు వచ్చింది. కృష్ణ గారిలో ఉండే ధైర్యం నాకు వచ్చింది. నా కుటుంబం నా వెంట నిలబడింది. మా అమ్మంటే నాకు చెప్పలేనంత ప్రేమ. అమ్మ కేవలం అమ్మ కాదు.. దేవత, స్నేహితురాలు అని వీకే నరేష్ ఎమోషనల్ అయ్యారు.

పవిత్రా లోకేష్‌తో ఆ నమ్మకం: నా జీవితంలో చాలా లైఫ్ గడిచిపోయింది. రీల్ లైఫ్ బాగుంది. కానీ రియల్ లైఫ్ బాగాలేదు. కాన 50 ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత మా అమ్మ తర్వాత ఇంకా మరో అమ్మను కలుసుకొన్నాను. అంతకంటే ఏం చెప్పలేను. ఒక పెళ్లిలో నమ్మకం, ఆప్యాయత, తోడు కోరుకొంటాం. వృద్దాప్యంలో ఓ బలాన్ని కోరుకొంటారు. కానీ నా జీవితంలో చివరికి నా గమ్యాన్ని నేను చేరుకొన్నాననే నమ్మకం పవిత్రా లోకేష్‌తో కలిగింది. నాకు అండగా నిలిచిన కృష్ణ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు అని వీకే నరేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











