Don't Miss!
- News
రాజమహేంద్రవరంలో భారీ జాతీయ జెండా.. 5200 మీటర్ల పొడవు
- Lifestyle
ముద్దొచ్చే బుజ్జాయిలను ముద్దాడనివ్వొద్దు
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
- Sports
దంచికొట్టిన చతేశ్వర్ పుజారా.. ఒకే ఓవర్లో 22 పరుగులు.. 73 బంతుల్లోనే సెంచరీ!
- Finance
NPS: UPI ద్వారా ఎన్పీఎస్ చెల్లింపులు చెయ్యొచ్చు.. ఎలాగంటే..?
- Technology
వీడియో స్ట్రీమింగ్ కోసం ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించనున్న YouTube
- Automobiles
పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..
నా భార్యకు అతడితో అక్రమ సంబంధం.. పవిత్రతో కలిసి వీకే నరేష్ డ్యాన్సులు చేసి విజిల్స్
ప్రముఖ నటుడు వీకే నరేష్ తన ప్రియురాలు పవిత్రా లోకేష్‌తో మైసూరులోని హోటల్‌లో పట్టుబడటం దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అర్ధరాత్రి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియాతో కలిసి హోటల్ గది వద్ద హంగామా సృష్టించారు. తనపై, తన ఫ్యామిలీ పరువును బజారుకీడిస్తూ నరేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తప్పుపడుతూ.. తన భర్త నిజ స్వరూపాన్ని మీడియాకు చూపించింది. తన భార్యకు మరోకరితో అక్రమ సంబంధం ఉందంటూ వీకే నరేష్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో మైసూరులోని ఓ హోటల్‌లో ఒకే గదిలో ఉంటున్న వీకే నరేష్, పవిత్రా లోకేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
హోటల్ గది వద్ద రాత్రంతా రమ్య రఘుపతి వెయిట్ చేసింది. ఉదయాన్ని ఆమె హోటల్ గది తలుపు తట్టడంతో వారు బయటకు వచ్చారు. గది నుంచి వీకే నరేష్, పవిత్రా లోకేష్‌ను చూడగానే రమ్య రఘుపతి రెచ్చిపోయారు. కాలి చెప్పు తీసి కొట్టేందుకు ముందుకు పరిగెత్తారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు ఆపడంతో పెద్ద గొడవ తప్పిపోయింది.

రమ్య రఘుపతి చెప్పు తీసుకొని మీదకు రావడం చూసి వీకే నరేష్ వెకిలిగా నవ్వులు నవ్వుతూ కనిపించారు. చెయ్యెత్తి సైగలు చేస్తూ రమ్య రఘపతిని గేలిచేశాడు. రమ్య మద్దతు దారులు వ్యతిరేక నినాదాలు చేస్తుంటే.. ఈలలు వేస్తూ డ్యాన్సులు చేశారు. ఇలాంటి సీరియస్ పరిస్థితుల్లోను వీకే నరేష్ వ్యవహరించిన తీరు విస్మయం కలిగించింది.
అయితే రమ్య రఘుపతిని ఉద్దేశించి.. వీకే నరేష్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీకే నరేష్, పవిత్రా లోకేష్‌ను సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టులోకి తోశారు. అయితే లిఫ్టులో నుంచే నరేష్.. ఫ్రాడ్..చీటర్ అంటూ కామెంట్లు చేస్తూ విజిల్,చప్పట్లు కొట్టాడు. అయితే రమ్య మద్దతుదారులు పవిత్రా లోకేష్, నరేష్‌కు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేయడం వినిపించింది.
హోటల్ గది నుంచి బయటకు వచ్చిన పవిత్రా లోకేష్, నరేష్ కారులో వెళ్లిపోతూ.. తన భార్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రమ్యకు రాకేష్ రెడ్డికి అక్రమ సంబంధం ఉంది. వారిద్దరు అఫైర్‌లో ఉన్నారు. వారిద్దరూ కలిసి నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారిద్దరూ బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని వీకే నరేష్ అన్నారు.
మైసూర్ హోటల్‌లో వీకే నరేష్ చేసిన పనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ వయసులో ఇది అవసరమా? అంత టెన్షన్‌లోను విజిల్స్ వేసి బాగానే డ్యాన్సులు చేశావు మావా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే కన్నడ మీడియాలోను, దక్షిణాది మీడియాలోను వీకే నరేష్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వీడియోలు రెడ్ హ్యాండెడ్‌గా మారాయి.