‘మా’ వివాదం కొత్త మలుపు.. చిరంజీవి పెట్టిన రూల్స్ మారుస్తారా? వీకే నరేష్ ఫైర్

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో వివాదం సరికొత్త మలుపు తిరిగింది. అధ్యక్షుడు నరేష్ లేకుండానే సమావేశం జరగడం మరింత వివాదంగా మారింది. ఈ సమావేశం తర్వాత జీవిత ఇచ్చిన వివరణ తర్వాత మీడియాలో అధ్యక్షుడు వీకే నరేష్ తీవ్రంగా స్పందిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మా నిబంధనలు తుంగలో తొక్కారని నరేస్ ఆరోపించారు. నరేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

నిబంధనలకు విరుద్ధంగా

నిబంధనలకు విరుద్ధంగా

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో ఎలాంటి సమావేశం జరిగినా.. అధ్యక్షుడిగా నేను సమావేశాన్ని నిర్వహించాలి. కానీ తాజాగా జరిగిన సమావేశం అందుకు విరుద్ధంగా జరిగింది. ఇలాంటి సమావేశాలకు సంబంధించిన చరిత్రను ప్రతీ ఒక్కరికి తెలియాలి. 25 రోజుల క్రితం నాకు ఓ లెటర్ వచ్చింది. అందులో అత్యవసర సమావేశానికి రావాలని సూచించారు. అయితే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించే అధికారం నాకు ఉంది.

అందుకే హాజరుకాలేదు

అందుకే హాజరుకాలేదు

మా కమిటీ నన్ను పక్కన పెట్టి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం వెనుక అసలు కారణం అర్ధం కాలేదు. నేను మూవీ ఆర్టిస్టు సమావేశానికి హాజరుకావడం లేదని వారికి బదులు ఇచ్చాను. దాంతో మళ్లీ ఇది స్నేహపూర్వకమైన సమావేశం అని చెప్పారు. అయితే దానికి నేను హాజరుకానని చెప్పాను. ఓ భారీ సినిమా షూటింగ్‌కు హాజరుకావాల్సినందున నేను రానని చెప్పాను.

 అధ్యక్ష స్థానంలో ఉండకూడదని

అధ్యక్ష స్థానంలో ఉండకూడదని

ఇక స్నేహపూర్వక సమావేశమని చెప్పి.. కొందరు మా కమిటీ మీటింగ్ నిర్వహించారు. అయితే నా ప్రమేయం లేకుండా జరిగే సమావేశానికి హజరుకావొద్దని నిర్ణయం తీసుకొన్నాను. ఎజెండా లేకుండా అధ్యక్ష స్థానంలో ఉండకూడదని అనుకొన్నాను. ఏదైనా జరగకూడనిది జరిగితే దానికి నేను బాధ్యత వహించాల్సి వస్తుందని నేను హాజరు కాలేదు అని నరేష్ చెప్పారు.

చిరంజీవి రూల్స్ మారుస్తారా?

చిరంజీవి రూల్స్ మారుస్తారా?

నేను హాజరుకాని సమావేశంలో ఓ అడ్వకేట్ సహాయంతో మా రాజ్యాంగాన్ని మార్చాలని నిర్ణయం తీసుకోవడం షాక్ కలిగించింది. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఏర్పడిన మా బైలాస్‌ను మార్చాలని నిర్ణయం తీసుకోవడం నిబంధనలుకు విరుద్ధంగా మారింది. నాగార్జున, నాగబాబు లాంటి ఎంతో మంది ఈ కమిటీ అధ్యక్షులుగా ఉండి ఉన్నత విలువలను ఏర్పరిచారు. అలాంటి కమిటీ నిబంధనలు మారుస్తారా అని నరేష్ ఫైర్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X