పెళ్లి విషయంపై మొదటిసారి నోరు విప్పిన VK నరేష్.. అసలు విషయం అప్పుడే అంటూ..

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు VK నరేష్ పెళ్లి గురించి అనేక రకాల వార్తలు గత కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ను ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని చాలా రకాల కథనాలు కూడా వచ్చాయి. అయితే మొత్తానికి ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పెళ్లి వీడియో కూడా పోస్ట్ చేయడంతో ఇది నిజమా లేదా సినిమా ప్రమోషన్స్ కోసం చేసిందా అనే సందేహం కూడా వస్తోంది. ఇక ఈ విషయంలో మరోసారి మీడియా అడిగిన ప్రశ్నలకు నరేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

నరేష్, పవిత్ర లోకేష్

నరేష్, పవిత్ర లోకేష్

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి టైమింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు అందుకున్న వికే నరేష్ మూడో భార్య నుంచి విడాకులు తీసుకుని ఇప్పుడు పవిత్ర లొకేష్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు అని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. అయితే ఊహించిన విధంగా గతంలో వారు ముద్దు పెట్టుకున్న ఒక వీడియోను కూడా విడుదల చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. అయితే అది సినిమా ప్రమోషన్ లో భాగంగానే అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

పెళ్లి వీడియో వైరల్

పెళ్లి వీడియో వైరల్

నిజానికి వీకే నరేష్ పవిత్ర ఇద్దరు కూడా ఒక సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమాలో వారిద్దరూ కూడా జంటగా నటిస్తూ ఉండడంతో బహుశా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విధంగా చేసి ఉండవచ్చు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే వీకే నరేష్ మళ్లీ హఠాత్తుగా పెళ్లి చేసుకున్నట్లుగా ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ విషయం మరింత వైరల్ గా మారిపోయింది.

ఒక పవిత్ర బంధం అంటూ..

ఒక పవిత్ర బంధం అంటూ..

పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడూ అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్ర నరేష్ అనే.. ట్విట్టర్ వేదికగా వారు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న వీడియోని కూడా పోస్ట్ చేశారు.

ప్రెస్ మీట్ లో ఎదురైన ప్రశ్న

ప్రెస్ మీట్ లో ఎదురైన ప్రశ్న

ఇక నరేష్ నటించిన ఇంటింటి రామాయణం అనే సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొనగా అక్కడ ఆయనకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి మర్చిపోయారు. తెలుగు జనాలు మీ పెళ్లి గురించి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరేమో ఊరిస్తున్నారు.. అని ఎదురైన ప్రశ్నకు ఆయన చాలా సున్నితంగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

 క్లారిటీ ఇచ్చిన నరేష్

క్లారిటీ ఇచ్చిన నరేష్

నాకు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలని లేదు. నేను తప్పకుండా ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహిస్తాను. నేను ఎల్లప్పుడు మీడియా ఫ్రెండ్ ని. నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెబుతాను. రియల్ లైఫ్ రీల్ లైఫ్ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. నా జీవితాన్ని నేను జీవిస్తాను. నేను ఆ విషయంతో ఈ ప్రెస్ మీట్ ను మరొక విధంగా మార్చాలని అనుకోవట్లేదు. ఇది చాలా గొప్ప సినిమా. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో స్ఫూర్తినిచ్చే కథ. వంశీ, మారుతి ఇద్దరు కూడా కొత్త తరహా కంటెంట్ ను అందించారు. ఈ కంటెంట్ ను బట్టి కూడా ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. ఆ విషయంలో నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అని నరేష్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X