Naresh Pavitra Lokesh పెళ్లి చేసుకున్న నరేష్-పవిత్ర.. వాళ్ల సమక్షంలో అలా.. వీడియో వైరల్!
గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు సీనియర్ నటుడు, హీరో వీకే నరేష్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. వీళ్లిద్దరూ సహాజీవనం చేస్తున్నారని మొన్నటి వరు పుకార్లు బీభత్సంగా షికార్లు చేశాయి. వాటన్నింటిన మొదట్లో ఖండించిన వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు ప్రకటించారు.
అది కూడా ఫుల్ రొమాంటిక్ గా పవిత్రకు నరేష్ లిప్ కిస్ ఇచ్చిన వీడియోను షేర్ చేసి మరి అధికారికంగా వెల్లడించారు. అయితే తాజాగా ఎట్టకేలకు నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి జరిగింది. పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా మరోసారి పెళ్లి చేసుకున్న నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

హీరోల కంటే..
సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగంలో ఏ రిలేషన్ ఎప్పుడు.. ఎలా మారుతుందో చెప్పలేం. అలాగే సినీ సెలబ్రిటీల్లో రెండు, మూడు పెళ్లిల్లు, అఫైర్లు సాధారణంగా జరిగే వ్యవహారాలే. అందులో కొన్ని హైలెట్ అయితే మరికొన్ని ఇంకొకరికి తెలియకుండానే కనుమరిగిపోతాయి.
అయితే గత కొంతకాలంగా సినీ హీరోలు, హీరోయిన్ల కంటే మోస్ట్ పాపులర్ గా మారింది సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ రిలేషన్ షిప్.

మంచి స్నేహితులం..
నరేష్, పవిత్రా లోకేష్ వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని, అందుకోసం పలు ఆలయాలు కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు వస్తున్న సమయంలోనే వాళ్లిద్దరని మైసూర్ లోని ఓ హోటల్ గదిలో పట్టుకుని నరేష్ భార్య మూడో భార్య రమ్య మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ వివాదం హైలెట్ గా మారింది.
అలాగే నరేష్, పవిత్రా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి స్నేహితులం అంటూ ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు.

నరేష్ ఆగ్రహం..
ఈ విషయం తర్వాత పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లు అభ్యంతరకర వీడియోలు, ట్రోల్స్ చేస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటి వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నారని పవిత్ర లోకేష్, ఇటీవల మరోసారి నరేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై పోలీసులు కేసు విచారణ చేసి 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ కు నోటీసులు కూడా పంపించారు. ఇటీవలే మీడియా వేదికగా తమ బెడ్ రూమ్ లో దూరి చూసి చెప్పినట్లుగా రాస్తున్నారని నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లిప్ కిస్ ఇచ్చుకుని..
ఇదిలా ఉంటే ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియో ద్వారా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు నటుడు నరేష్. ఈ వీడియోలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు లిప్ కిస్ పెట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో క్లాకర్ వెలుగులతో మంచి రొమాంటిక్ గా వీడియోను చిత్రీకరించారు.

వివాహబంధంతో ఒక్కటి..
ఇక ఆ వీడియో చివర్లో హ్యాపీ న్యూయర్ 2023 అని చెబుతూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ తెలిపింది ఈ జంట. ఇప్పుడు వాళ్లు నరేష్ చెప్పినట్లుగా ఎట్టకేలకు సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లాడాడు. ఎలాంటి హడావిడి లేకుండా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సైలెంట్ గా నరేష్, పవిత్ర ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకున్నాడు నరేష్.
లైఫ్ టైమ్ సంతోషం..
"ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్రనరేష్" అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు నరేష్. "ఈ కొత్త ప్రయాణంలో శాంతి, సంతోషం కలగేందుకు మీ ఆశీర్వాదాలు అందించండి" అని కూడా రాసుకొచ్చారు. ఈ వీడియోలో పవిత్ర చేతికి కంకణం కట్టి, తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు. చివర్లో 'లైఫ్ టైమ్ పీస్ అండ్ జాయ్' అని వీడియోను ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











