twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ’మా‘ ఎన్నికల రచ్చ: డబ్బులు పంచుతున్నారు.. దిగజారుడుతనమా? శివాజీరాజాపై నరేష్ ఫైర్

    |

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు శివాజీరాజా, వీకే నరేష్ వర్గాలు అన్ని రకాల అస్త్రాలు వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఆదివారం (మార్చి 10) ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు పెద్దగా నటీనటుల నుంచి స్పందన రావడం లేదనే వార్తలు వస్తున్ననేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ పడుతున్న నరేష్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవేమిటంటే..

    'మా' ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత, రాజశేఖర్‌పై నాగబాబు కామెంట్స్! 'మా' ఎన్నికల్లో ట్విస్ట్.. జీవిత, రాజశేఖర్‌పై నాగబాబు కామెంట్స్!

    మందకొడిగా ఎన్నికల పోలింగ్

    మందకొడిగా ఎన్నికల పోలింగ్

    మా కొత్త నూతన కార్యవర్గం ఎంపిక కోసం ఆదివారం ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 11 గంటల సమయానికి కేవలం 216 ఓట్లు పోలైనట్టు సమాచారం. అయితే ఓటర్లను పోలింగ్‌కు రప్పించేందుకు రెండు ప్యానెల్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

     ధ్వజమెత్తిన వీకే నరేష్

    ధ్వజమెత్తిన వీకే నరేష్

    మా కార్యవర్గానికి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో శివాజీ రాజా ప్యానెల్‌పై నరేష్ విరుచుకుపడ్డారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బు, మద్యం పంచుతున్నారు. మా ఎన్నికల సందర్భంగా ఇలాంటివి చోటుచేసుకోవడం చాలా బాధాకరం అని వీకే నరేష్ అన్నారు. మా ఎన్నికల్లో ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

    శివాజీరాజా వర్గం ధీటుగా

    శివాజీరాజా వర్గం ధీటుగా

    వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలపై శివాజీ రాజా ప్యానెల్ సభ్యులు ఘాటుగా స్పందిస్తున్నారు. తమపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ప్యానెల్ సభ్యులు తిప్పికొట్టారు. ఓటమి భయంతోనే తమపై అసత్య ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బు పంచి గెలువాల్సిన పరిస్థితి మాకు లేదనే మాట చెప్పడం గమనార్హం.

     వికె నరేష్ ప్యానల్ ఇదే

    వికె నరేష్ ప్యానల్ ఇదే

    ప్రెసిడెంటు: నరేష్
    ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: రాజశేఖర్,
    జనరల్ సెక్రటరీ: జీవిత
    ట్రెజరర్: కోటా శంకర్రావు:
    వైస్ ప్రెసిడెంట్: మానిక్ జాయింట్
    సెక్రటరీ: శివ బాలాజీ
    జాయింట్ సెక్రటరీ: గౌతం రాజు
    వైస్ ప్రెసిడెంట్: హరనాథ్ బాబు
    సభ్యులు: శ్రీముఖి, జెఎల్ శ్రీనివాస్, జాకీ, శ్రీనివాసులు, అలీ, లక్ష్మీ నారాయణ, అశోక్ కుమార్, ఎం.కృష్ణం రాజు, మధుమిత, కరాటే కళ్యాణి, వడ్లపట్ల, బాబీ, వింజమూరి మధు, కుమార్ కొమ్మకుల, సత్యం యాబి, లక్ష్మీకాంతరావు, మోహన్ మిత్ర, రాజేశ్వరి.

     శివాజీ రాజా ప్యానెల్ ఇదే

    శివాజీ రాజా ప్యానెల్ ఇదే

    ప్రెసిడెంట్: శివాజీ రాజా
    ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటు: హీరో శ్రీకాంత్
    జనరల్ సెక్రటరీ: రఘుబాబు
    ట్రెజరర్: రాజీవ్ కనకాల
    వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ
    వైస్ ప్రసిడెంట్: ఎస్వీ కృష్ణారెడ్డి
    జాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీ
    జాయింట్ సెక్రటరీ: నాగినీడు
    సభ్యులు: తనీష్, ఉత్తేజ్, అనితా చౌదరి, బాలాజీ నవభారత్, పృథ్వీ రాజ్, భూపాల్ రాజు, సి. వెంకట గోవిందరావు, రాజా రవీంద్ర, డి రవి ప్రకాష్, ఏడిద శ్రీరామ్, హెచ్ జయలక్ష్మి, వేణు మాధవ్, సురేష్ కొండేటి, సాయి కుమార్, రాజ్ తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి.

    English summary
    MAA Elections are going with hot phase in Tollywood. Mega hero Nagababu taken sensational decision to support Naresh Panel instead of Shivaji Raja Panel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X