పవిత్ర లోకేష్ తో బంధంపై పెదవి విప్పిన నరేష్..అసలు విషయం ఇదీ అంటూ!
చాలా రోజులుగా నటుడు నరేష్ నాలుగో వివాహం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే తన పీఆర్ టీమ్ ద్వారా అలాంటిదేమీ లేదని స్పందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక కన్నడ మీడియా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా పవిత్ర లోకేష్ తాను వీకే నరేష్ సహజీవనం చేస్తున్నామని చెప్పినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపద్యంలో ఈ వ్యవహారం మీద నటుడు నరేష్ ఒక కన్నడ మీడియా ఛానల్ తో మాట్లాడినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

కన్నడ మీడియా ఛానల్ తో
నటుడు నరేష్-పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారని కొన్ని సార్లు, లేదు వీరు వివాహం చేసుకోబోతున్నారని కొన్ని సార్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. కన్నడ మీడియా ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా తాము సహజీవనం చేస్తున్నామని తమ బంధానికి కృష్ణ కుటుంబం సపోర్ట్ కూడా ఉందని పవిత్ర లోకేష్ బయటపెట్టినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం మీద నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా ఒక కన్నడ మీడియా ఛానల్ తో నరేష్ మాట్లాడినట్లు సమాచారం.

అబాండాలు వేస్తుంది
గత కొద్ది రోజుల నుంచి మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు వస్తున్నాయి కానీ అది నిజం కాదని ఆయన అన్నారు. అలాంటి వార్తలను హైలెట్ చేస్తూ రమ్య మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తోందని ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే అని నరేష్ చెప్పుకొచ్చారు. మీడియా ముందు తనను తాను గొప్పగా చెప్పుకోవడం కోసం మా మీద ఆమె అబాండాలు వేస్తుంది ఆమె చేసిన పనుల గురించి చెప్పాలంటే నాకు నోరు కూడా రావడం లేదు, పవిత్ర లోకేష్ ని టార్గెట్ చేసి నన్ను సాధించాలని నా మీద ఆరోపణలు చేయాలని చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువగా మాట్లాడదు కానీ
పవిత్ర లోకేష్ తనకు ఐదేళ్ల నుంచి తెలుసని పేర్కొన్న ఆయన హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా సమయంలో పరిచయమైందని మామూలుగా అయితే ఆమె ఎక్కువగా మాట్లాడదు కానీ ఆ తర్వాత తాము కలిసి చేసిన సమ్మోహనం సినిమా సమయంలో నా పరిస్థితి తెలిసి ఆమె మాట్లాడిందని చెప్పుకొచ్చారు.

స్నేహం ఉంది తప్ప
అలా మాట్లాడుకుంటూ స్నేహితులమయ్యామని తాను ఒక మగాడిని మాత్రమే కాదు మనిషిని కూడా అని గుర్తు చేసిన ఆయన తనకు కూడా ప్రేమ కావాల్సి ఉంటుందని అలా ప్రేమగా ఎవరు మాట్లాడతారా అని ఎదురుచూస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. అలా సమ్మోహనం షూటింగ్ సమయంలో క్లోజ్ అవ్వడంతో నాకు ఆమె ఒక మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, బెస్ట్ ఫ్రెండ్ ఒక గైడ్ లాగా మా మధ్య మంచి స్నేహం ఉంది తప్ప అంతకుమించి ఏమీ లేదని అన్నారు.

స్నేహితురాలని
మేమిద్దరం కలిసి ఒక ఫంక్షన్ లో కనిపించాం తర్వాత ఒక గుడికి వెళ్ళాం అని ఆయన అన్నారు. అసలు ఇది 2022 సంవత్సరం కదా స్నేహితులు కలిసి బయటకి కూడా వెళ్లకూడదా అని ఆయన ప్రశ్నించారు. పవిత్ర లోకేష్ ను అడ్డం పెట్టుకుని రమ్య ఫేమస్ అవ్వాలని చూస్తుందన్న ఆయన తమ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని కేవలం పవిత్ర తన స్నేహితురాలని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











