చిరంజీవి సినిమా కూడా వదిలేసా
ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా మనసంతా ఆ సినిమా మీదే ధ్యాస ఉంటుంది. దాన్ని మధ్యలో వదిలేసి మరో సినిమా టేకప్ చెయ్యాలనే ధ్యాస ఉండేది కాదు. ఓ సారి చిరంజీవి గారితో సినిమా చేసే అవకాసం దక్కింది. ఆ సమయంలో మరో సినిమాలో బిజీగా ఉన్నాను. దాన్ని అర్దాంతరంగా ఆపేయటం ఇష్టం లేక ఆ ఆఫర్ వదులుకున్నాను అంటున్నారు వియన్ అదిత్య. రీసెంట్ గా ఆయన రూపొందించిన ముగ్గురు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మీడయాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే కెరీర్ ప్రారంభ దశలో మనసంతా నువ్వే వంటి హిట్టు సాధించిన ఆయన ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఏదైనా ఓ పద్దతి ప్రకారం జరగాలనుకునే వ్యక్తిని నేను. మనసంతా నువ్వే తర్వాత దాదాపు ఇరవై మంది నిర్మాతలు నన్ను సినిమా చేసి పెట్టమని అడిగారు. అడ్వాన్స్ లు చేతిలో పెట్టబోయారు. అడ్వాన్స్ లు ఇచ్చారని కమిటైపోయి నేను సినిమాలు చేయలేను.నా మనస్సుకు నచ్చినప్పుడు తీస్తాననే వాడిని. అలా ఎవరి దగ్గరా అడ్వాన్స్ లు తీసుకోలేదు అన్నారు.ఇక ముగ్గరు చిత్రం కామిడీ టాక్ తెచ్చుకుందని వివరించారు.


Click it and Unblock the Notifications











