వియన్ ఆదిత్య దర్శకత్వంలో 'త్రీ ఇడియట్స్' చిత్రం..పూర్తి డిటేల్స్

By Srikanya

మనసంతా నువ్వే చిత్రంతో పరిచయమైన దర్శకుడు వియన్ ఆదిత్య ఆ తర్వాత ఆ రేంజి హిట్ ని ఇవ్వలేకపోయారు. పీల్ గుడ్ స్టోరీస్ పేరుపడ్డ ఆదిత్య రీసెంట్ గా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ చిత్రం టైటిల్ త్రి ఇడియట్స్. ప్రముఖ నిర్మాత రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అలాగని హిందీ త్రీ ఇడియట్స్ కీ ఈ చిత్రానికి సంభందం లేదని చెప్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్, అష్టా చెమ్మ ఫేమ్ అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నారు. శ్రధ్దాదాస్, సంజన, సౌమ్య ఈచిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీ అని బాలీవుడ్ చిత్రాలు వెలకమ్, ధాంక్యూ తరహాల కథతో ఉండబోతోందని చెప్త్తున్నారు. ఈ చిత్రంలో ఎక్కువ భాగం మలేషియాలోనూ, హైదరాబాద్ లోనూ చిత్రీకరించనున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానున్నది. రీమాసేన్, శివాజి ఈ చిత్రంలో గెస్ట్ గా కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X