30 రోజుల్లో ‘ముగ్గురు’ఫినిష్

By Srikanya

వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో డా॥డి. రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు"చిత్రం షూటింగ్ ముప్పై రోజుల్లో పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజనా తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి తన మనవడు, సురేష్‌బాబు తనయుడు సురేష్ అభిరామ్‌కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ''35రోజుల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఓ కొత్త చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది"" అన్నారు.

''పదిమంది బాగుండాలని కోరుకునే రామానాయుడిగారి సినిమాకి మాటలు రాయడం ఆనందంగా ఉంది"" అని సత్యానంద్ చెప్పారు. ''ఈ చిత్రంలో ఐదు పాటలు రాశాను. వీటిలో ఒక సినిమాకి ఎవరెవరు పని చేస్తారు? వారి ప్రత్యేకత ఏంటి? అని చెప్పే విధంగా రాసిన పాట సంతృప్తినిచ్చింది"" అని చంద్రబోస్ అన్నారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - ''కోటిగారు ఒకే సిట్టింగ్‌లో అన్ని పాటలకు బాణీలిచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాయికి తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది"" అని చెప్పారు. ఈ చిత్రంలో నటించినందుకు నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య తదితరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X