మనసంతా నువ్వే దర్శకుడు తాజా చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

మనసంతా నువ్వే,శ్రీరామ్,మనస్సు మాట వినదు, బాస్ వంటి చిత్రాల దర్శకుడు వియన్ ఆదిత్య తాజాగా రాజ్ అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందజే. ఈ చిత్రం జనవరి నెలాఖరుకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సుమంత్ హీరోగా చేసిన ఈ చిత్రంలో అతని సరసన ప్రియమణి,విమలారామన్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆదిత్య మాట్లాడుతూ..."సుమంత్‌కు సరిపోయే కథతో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అన్ని వర్గాలను మెప్పించే అన్ని అంశాలున్నాయి'' అన్నారు.

నిర్మాతలు కుమార్ బ్రదర్శ్ మాట్లాడుతూ..."సుమంత్ ఇమేజ్‌కు సరిపోయే మంచి కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. హైదరాబాద్ పరిసరాలతో పాటు గోవాలోని పలు అందమైన ప్రదేశాల్లో జరిగిన భారీ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయింది. వీఎన్ ఆదిత్య అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం సుమంత్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. ఈనెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.

బ్రహ్మానందం, సాయాజీ షిండే, అలీ, అజయ్, శ్రీనివాసరెడ్డి, వేణుమాధవ్, గిరిబాబు, వైజాగ్ ప్రసాద్, సంజన జనక్, తెలంగాణ శకుంతల, సత్యం రాజేష్, సైరాభాను, మున్నా వేణు, జెన్నీ, గుండు హనుమంతరావు తదితరులు ఇతర పాత్రధారులు. కూర్పు: కె.వి.రెడ్డి, ఫైట్స్: గణేష్, కెమెరా: జగన్,సంగీతం: కోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.పాండురంగ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X