మనసంతా నువ్వే దర్శకుడు తాజా చిత్రం రాజ్ రిలీజ్ ఎప్పుడంటే...
వియన్ ఆదిత్య తాజాగా రాజ్ చిత్రం ఈనెల 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సుమంత్ హీరోగా చేసిన ఈ చిత్రంలో అతని సరసన ప్రియమణి,విమలారామన్ నటిస్తున్నారు.ఈ చిత్రంలో సుమంత్ ఫోటో గ్రాఫర్ గా కనిపించనున్నారు. అతన్ని ఇద్దరూ హీరోయిన్స్ ఒకరకి తెలియకుండా మరొకరు ప్రేమిస్తూంటారు. వీరిద్దరులో ఎవరు రాజ్ తో సెటిలవుతారనేది చిత్రంలో సస్పెన్స్ . నిర్మాతలు.
నిర్మాతలు కుమార్ బ్రదర్స్ మాట్లాడుతూ ''సరదాగా సాగిపోయే ప్రేమకథ ఇది. రాజ్‌గా సుమంత్ నటన కొత్త తరహాలో సాగుతుంది. ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్య ఇరుక్కున్న అబ్బాయిగా వినోదం పండిస్తారు. హీరోయిన్స్ ఇద్దరవీ బలమైన పాత్రలే. 'భీమవరం బుల్లోడా' అనే పాట అందరికీ నచ్చుతుంది అంటున్నారు. బ్రహ్మానందం, సాయాజీ షిండే, అలీ, అజయ్, శ్రీనివాసరెడ్డి, వేణుమాధవ్, గిరిబాబు, వైజాగ్ ప్రసాద్, సంజన జనక్, తెలంగాణ శకుంతల, సత్యం రాజేష్, సైరాభాను, మున్నా వేణు, జెన్నీ, గుండు హనుమంతరావు తదితరులు ఇతర పాత్రధారులు. కూర్పు: కె.వి.రెడ్డి, ఫైట్స్: గణేష్, కెమెరా: జగన్,సంగీతం: కోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.పాండురంగ.


Click it and Unblock the Notifications











