ఇదో ఫ్లాఫ్ కాంబినేషన్..

తరుణ్ హీరోగా భలే దొంగలు ఫ్లాప్ వచ్చిన తర్వాత వస్తున్న చిత్రం ఇది. వియన్ ఆదిత్య సైతం గతంలో రెయిన్ బొ అనే డిజాస్టర్ చిత్రాన్ని ఇచ్చారు. నిర్మాత సుప్రీమ్ రాజు..గతంలో మంచు విష్ణువర్ధన్ బాబు హీరోగా అస్త్రం అనే పెద్ద ప్లాఫ్ సినిమా ఇచ్చారు. ఇక వీరందరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మలేషియా బ్యాక్ డ్రాప్ లో కధ నడవనుందని తెలుస్తోంది. ఓ హిట్ హిందీ చిత్రం ఫ్రీమేక్ అని పిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. ఇక ప్రణవ్ స్టూడియోస్ గోగినేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని సమర్ఫించనున్నారు. ఇక ఈ చిత్రమైనా హిట్ అయి హిట్ టీమ్ గా మారుస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











