నూతన నటీనటులుకు తేజ పిలుపు
దర్శకుడు తేజ మరోసారి తన చిత్రంలో నూతన నటీనటులుకు అవకాశమివ్వటానికి ముందుకొస్తున్నారు. అయితే ఈ సారి వొడాఫోన్ ఎస్సార్ వారు ఈసారి ఈ టాలెంట్ హంట్ కు కలిసిపనిచేయటానికి ముందుకొచ్చారు. ఈ టాలెంట్ హంట్ లో పాల్గొనదలిచిన అభ్యర్ధులు తప్పనిసరిగా వొడాఫోన్ వాడాలి. అదీ ఎపి నెంబర్ అయి ఉండాలి. ఈ నెంబర్ తో కాల్ చేసి తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా ఈ నెంబర్ తో ఎస్.ఎమ్.ఎస్ చేయవచ్చు. అక్టోబర్ 30 నుంచీ ఈ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని వొడాఫోన్ చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్.మురళి మీడియాకు తెలిపారు. ఈ టాలెంట్ హంట్ ద్వారా నటులు అవుదామనుకున్న చాలా మందికి హెల్ప్ చేసినట్లు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఇతర వివరాల కోసం దివ్య సుబ్రమణ్యం..ఫోన్ నెంబర్ 9703804112 కాంట్రాక్ట్ చేయవచ్చు. లేదా [email protected] మెయిల్ చేయవచ్చు. ఇక తేజ ప్రస్తుతం అటు..ఇటు అనే చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











