వర్మపై ఇతరుల కోణం...‘వోడ్కా విత్ వర్మ’
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటికే 'నా ఇష్టం' అనే పుస్తకం రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ పై 'వోడ్కా విత్ వర్మ' అనే మరోపుస్తకం విడుదలైంది. 'నా ఇష్టం' పుస్తకం వర్మ తన గురించి తాను చెప్పుకున్న విశేషాలతో ఉంటే...'వోడ్కా విత్ వర్మ' పుస్తకం ఇతర అభిప్రాయంలో వర్మ గురించి విషయాలు ఇందులో పొందు పరిచారు. సినీ రచయిత సిరాశ్రీ ఈ పుస్తకాన్ని రచించారు.
ఈ పుస్తకావిష్కరణ గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, దేవా కట్ట, రేవంత్ రెడ్డి, సుబ్బరాజు, కోన వెంకట్, మధు శాలిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నాపై ప్రమోగాత్మక పుస్తకం రూపొందించిన సిరాశ్రీకి థాంక్స్ చెప్పారు.
అందరు అనుకున్నట్లు కోట్లు సంపాదించడానికి నేను ఇండస్టీకి రాలేదని, ఓ కథను కసితో చెప్పడానికి వచ్చానని చెప్పుకొచ్చిన వర్మ.... సినిమాకు కథతో పాటు అందులో భావోద్వేగాలు ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు. తన తాజా చిత్రం 26/11 ఎమెషన్స్ బేస్డ్ గా ఉంటుంది. దాడి జరిగిన రోజు తాజ్ హోటల్ లో కస్టమర్ గా ఉంటే నేను ఎలా పీలవుతానో వాటినే ఇందులో చూపెట్టానన్నారు.
ఈ పుస్తకంలో ముందు మాటను పూరి జగన్నాథ్ రాసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివ సినిమా చూసి వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. మూడున్నర సంవత్సరాల వరకు నా పేరు కూడా ఆయనకు తెలీదు. కానీ ఆయన దగ్గర పని చేయడం వల్లనే మాకు బయట అవకాశాలు దొరికాయని వెల్లడించారు. ఈ పుస్తకంలో పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ లాంటి వారి అభిప్రాయాలతో పాటు వర్మ భార్య, కుమార్తె అభిప్రాయాలు కూడా ఉన్నాయని రచయిత సిరాశ్రీ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












