పవన్ కళ్యాణ్ ‘ఇజం’ బుక్ గెలుచుకోండి ఇలా....
హైదరాబాద్: జనసేన పార్టీ స్థాపనతో రాజకీయ అరంగ్రేటం చేసిన సినీ నటుడు పవన్ కల్యాణ్, ఈనెల 27వ తేదీన తన పార్టీ సిద్ధాంత పత్రం 'ఇజం' స్థానిక మునిసిపల్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఆవిష్కరించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన స్నేహితుడు రాజు రవితేజతో కలిసి 'ఇజం' పుస్తకం రూపొందించారు.
ఈ పుస్తకాన్ని అభిమానులు గెలుచుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కేవలం మీ అభిప్రాయాలు వెల్లడించడమే. రాజకీయాలు, జన సేన పార్టీ గురించి మీ అభిప్రాయం చెబితే సరిపోతుంది. పుస్తకం గెలుచుకోవాలనే ఆసక్తిగలవారు సంప్రదించాల్సిన లింక్: http://janasenaparty.org/index.php/site/social

జాతికోసం యువత - జాతికోసం పోరు అనే నినాదంతో దేశం కోసం పోరాడేందుకు సిద్ధం కావాలని పవన్ కల్యాణ్, యువతకు పిలుపు ఇవ్వనున్నారు. ఈ సభలో పార్టీ రాజకీయ విధానాలు, సిద్ధాంతాలు, ఇతర అంశాలపై పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. జనసేన సిద్ధాంతాలను పూర్తిస్థాయిలో వెల్లడించి, వాటిని వివరించే ఇజం పుస్తకాన్ని విడుదల చేసేందుకు విశాఖను వేదికగా ఎంచుకొన్నారు.
సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసం మాత్రమే పోరాటం చేస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే తాత్కాలిక పార్టీ కాదని తెలుస్తోంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను తప్ప ఇక ఏ సెలవు దినాలను పాటించకూడదని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications











