బస్సు ప్రమాదం: పవన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సజీవ దహనం(ఫోటో)
హైదరాబాద్: బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు బుధవారం తెల్లవారు ఝామున అగ్నిప్రమాదానికి గురై 42 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. వీరిలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్‌తో పాటు ఆయన సోదరి కూడా ఉన్నారు. ఈ సంఘటనతో షాకైన మెగా ఫ్యామిలీ వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
మెగా ఫ్యామిలీ పిఆర్ఓ ఎస్‌కెఎన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో వెంకటేష్ యాదవ్ దిగిన ఫోటోను కూడా ఆయన పోస్టు చేసారు. ఈ సంఘటన మెగా అభిమానులను తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోని మెగా అభిమాన సంఘాల సభ్యులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసారు.
మరో వైపు వెంకటేష్ మృతి చెందిన విషయాన్ని మెగా అభిమాన సంఘాలు నిర్వహిస్తున్న ఫేస్ బుక్ ఫేజీల్లో కూడా ధృవీకరించారు. ఆయన అఖిల కర్నాటక చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంటుగా వారు పేర్కొన్నారు. మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ దుర్ఘటనను జీర్ణించుకోలేక పోతున్నారు.


Click it and Unblock the Notifications












