twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు విష్ణు బెదిరిస్తున్నాడు.. మానసికంగా వేధిస్తున్నాడు.. ఓటర్ దర్శకుడు ఆవేదన

    |

    Recommended Video

    Director Karthik Reddy Made Serious Allegations On Manchu Vishnu || Filmibeat Telugu

    సినీ హీరో మంచు మనోజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తనను వేధిస్తున్నారంటూ ఓటర్ మూవీ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తప్పుడు అగ్రిమెంట్‌తో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగు సినీ దర్శకుల సంఘంలో కార్తీక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...

    అసెంబ్లీ రౌడీ కథకు సంబంధం లేదని

    అసెంబ్లీ రౌడీ కథకు సంబంధం లేదని

    హీరో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి, తాను రాసుకొన్న ఓటర్ సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చేయడానికి బలవంతంగా తప్పుడు అగ్రిమెంట్ చేయించుకొన్నారు. తనను బెదిరింరి మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి అగ్రిమెంట్ పేపర్లపై తనతో సంతకాలు చేయించుకొన్నారు అని దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆరోపించారు.

    మంచు విష్ణు తీవ్ర జోక్యంతో

    మంచు విష్ణు తీవ్ర జోక్యంతో

    తొలుత నేను పవర్‌ఫుల్ అనే కథను రాసుకొని ఓటర్ సినిమా తీశాను. ఆ కథను తెలుగు సినీ రచయితల సంఘంలో కూడా రిజిస్టర్ చేశాను. నేను చెప్పిన పవర్‌ఫుల్ కథ నచ్చి నటించడానికి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత సినిమా పేరును ఓటర్‌గా మార్చాం. షూటింగ్ దశంలో రెండు సీన్లు మార్చాలని విష్ణు ఒత్తిడి తీసుకొచ్చాడు. సినిమా నిర్మాణంలో తనకు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతీ అంశంలో జోక్యం చేసుకొన్నాడు. దాంతో సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది అని కార్తీక్ రెడ్డి తెలిపారు.

    నాపై బెదిరింపులకు పాల్పడి

    నాపై బెదిరింపులకు పాల్పడి

    ఓటర్ చిత్రం పూర్తయిన తర్వాత సినిమా చూశాడు. సినిమా అద్భుతంగా రావడంతో కథకు మంచి పేరు వస్తుందని భావించాడు. ఆ తర్వాత కథ, స్క్రీన్‌ప్లే క్రెడిట్స్‌ను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను ఒప్పుకోకపోతే నన్ను బెదిరించాడు. ఆయన బెదిరింపులు, ఒత్తిడి తట్టుకోలేక స్క్రీన్ ప్లే రైటర్‌గా మంచు విష్ణు పేరు వేశాను అని కార్తీక్ రెడ్డి వెల్లడించారు.

    సినిమాను అడ్డుకొంటున్నాడని..

    సినిమాను అడ్డుకొంటున్నాడని..

    అనేక ఒత్తిడులు, బెదిరింపుల మధ్య ఓటర్ సినిమాను పూర్తి చేశాను. ఈ సినిమా పూర్తి చేయడానికి మానసిక క్షోభను అనుభవించాను. ఇలాంటి ఇబ్బందుల మధ్య ఓటర్‌ను విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. నన్ను బెదిరించి రాయించుకొన్న తప్పుడు ఒప్పంద పత్రాలతో విడుదలకు అడ్డుపడుతున్నారు అని కార్తీక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Hero Manchu Vishnu landed fresh contraversy in Voter Movie rights. Director Karthik Reddy made serious allegations over Vishnu. He alleges that, Vishnu and His friend Vijay Kumar Reddy warned and made to sign on wrong agreement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X